Karnataka: బాలికపై అత్యాచారం.. 50 దళిత కుటుంబాలు వెలివేత !

కర్ణాటకలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిపై కేసు పెట్టడంతో గ్రామంలోని దళితులను వెలివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Boycott
New Update

కర్ణాటకలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిపై కేసు పెట్టడంతో గ్రామంలోని దళితులను వెలివేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గిర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. చివరికి బాలిక గర్భవతి అయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా.. ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని చెప్పింది. 

Also Read: అధికారుల వెనక ఉన్న నేతలను కూడా వదిలిపెట్టం.. RTV ఇంటర్వ్యూలో రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు!

దీంతో వాళ్లు నిందితుడి వద్దకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరారు. అతడు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావడంతో దళిత బాలికను వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. ఈ విషయంపై బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాలిక కుటుంబం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామంలోని 50 దళిత కుటుంబాలను గ్రామ పెద్దలు వెలేశారు. ప్రాథమిక సౌకర్యాలు, కిరణా సామగ్రి, ఆహారం అందకుండా చేస్తున్నారని దళిత సంఘాల సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో గ్రామ పెద్దలను అదుపులోకి తీసుకొని వాళ్లని విచారించగా.. వారు ఈ ఆరోపణలు ఖండించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

#karnataka #telugu-news #attrocities-on-dalits
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe