/rtv/media/media_files/2024/12/01/SFbWcY7sge5zEd2dVKPn.jpeg)
Chennai: తమిళనాడులో బీభత్సం సృష్టించిన ఫెంగల్ తుపాను చెన్నైలో ముగ్గురిని బలి తీసుకుంది. తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తోంది. అయితే, భారీ నష్టానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం లేకున్నా తమిళనాడు, పుదుచ్చేరిలలో గత మూడు దశాబ్దాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది.
Also Read: ధనుష్ తో వివాదం.. దెబ్బకు సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేసిన నయనతార భర్త
తుపాను కారణంగా చెన్నై విమానాశ్రయం 16 గంటల పాటు మూసివేశారు. ఈ ఉదయం 4 గంటలకు తెరుచుకున్నా చాలా వరకు విమానాలు రద్దు అవ్వగా, మరికొన్ని ఆలస్యంగా నడవనున్నట్లు సమాచారం. చెన్నై, పుదుచ్చేరి సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వానల కారణంగా జనజీవనం అతాలాకుతాలం అయ్యింది. ప్రజా రవాణా స్తంభించింది.
Also Read: Watch Video: తుపాను ఎఫెక్ట్, విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం.. చివరికి
#WATCH | Puducherry continues to experience heavy rainfall accompanied by strong winds as #FengalCyclone made landfall on the Puducherry coast at 7 pm on Saturday.
— ANI (@ANI) December 1, 2024
Storm to move south-west of Tamil Nadu, weaken into deep depression, says IMD
Visuals from the Rainbow Nagar area… pic.twitter.com/zBW19Qx4JU
బస్సులు, రైళ్ల ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది.అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల్లో స్థిరంగా ఉన్న తుపాను క్రమంగా అల్పపీడనంగా బలహీనపడుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది.
Also Read: Nagarjuna : కాబోయే కోడలికి నాగార్జున కాస్ట్లీ గిఫ్ట్.. ఏంటో తెలుసా?
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. జనావాసాలు నీటమునిగాయి. ఫెంగాల్ తుఫాను పుదచ్చేరికి సమీపించిన అనంతరం అక్కడ 47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విల్లుపురం జిల్లాలో 50 సెం.మీ, కడలూరులో 18 సెం.మీ, మరకానాలో 23.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఫెంగాల్ తుఫాను గత రాత్రి తీరం దాటినప్పటికీ కూడా మారకానాలా ఇప్పటికీ బలమైన గాలులు వీస్తున్నాయి.
Also Read: కాలయముడైన తాగుబోతు..! అనాథలుగా మారిన ఇద్దరు పసివాళ్లు! వీళ్ళ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు
ఇప్పటికే పుదుచ్చేరిలో జనజీవనం స్తంభించింది. మామల్లపురం పరిసర ప్రాంతాల్లో వర్షం ఇంకా కురుస్తోంది. గాలి వేగం ఎక్కువగా ఉండటం వల్ల విద్యుత్ సరఫరా కాలేదు. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తీరం దాటింది. గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో గాలులు వీయడం వల్ల పలుచోట్లు చెట్లు నేలకూలాయి. ఈ నేపథ్యంలోనే పుదుచ్చేరి, అలాగే తమిళనాడులో 6 జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్డ్ జారీ చేసింది.
ఇదిలాఉండగా.. పెంగాల్ తుపాను తీరం దాటాకా కూడా చెన్నై, తిరువళ్లూరు, కారైకాల్‌తో పాటు 22 జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బెంగాల్‌లో తుఫాను కారణంగా ఏర్పడ్డ మేఘాల వల్ల తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురవనున్నాయి. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు,తంజావురు, నాగపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.