కాలయముడైన తాగుబోతు..! అనాథలుగా మారిన ఇద్దరు పసివాళ్లు! వీళ్ళ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు రోడ్డు పై తప్ప తాగి ఓ తాగుబోతు చేసిన పనికి ఇద్దరు పసివాళ్లు అనాథలయ్యారు. మద్యం మత్తులో బైక్ పై వెళ్తున్న పిల్లల తల్లిదండ్రులను కారుతో ఢీకొట్టాడు ఓ దుండగుడు. అమ్మా, నాన్న అంటూ ఆ పిల్లలు ఏడుస్తున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. By Archana 01 Dec 2024 in క్రైం హైదరాబాద్ New Update accident (2) షేర్ చేయండి Hyderabad Road Accident: అదొక సంతోషకరమైన రోజు.. ఇద్దరు పిల్లలు, అమ్మ, నాన్న సంతోషంగా గోవా ట్రిప్ పూర్తిచేసుకొని రాత్రి హైదరాబాద్ లోని తమ ఇంటికి తిరిగొచ్చారు. కానీ అదే తమ పిల్లలతో వారికి చివరి రాత్రి అవుతుందని ఊహించలేకపోయారు ఆ తల్లిదండ్రలు. ఒక గంటలో తిరోగిస్తామని చెప్పి వెళ్లిన ఆ అమ్మ, నాన్న తెల్లవారే సరికి తమ పిల్లలకు శవాలుగా కనిపించారు. అమ్మా, నాన్న అంటూ ఆ పిల్లలు ఏడుస్తున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. చిన్నతనంలోనే ఆ పిల్లలు అనాథలుగా మారడానికి కారణం.. ఓ తాగుబోతు తప్ప తాగి చేసిన మతిలేని పని. తాగిన మత్తులో పిల్లల తల్లిదండ్రులను చంపేశాడు ఓ దుర్మార్గుడు. Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా అమ్మ, నాన్న కావాలి మొనా, దినేష్ దంపతులు శనివారం రాత్రి బైక్ పై వెళ్తుండగా .. మద్యం మత్తులో కారు తోలుతున్న ఓ దుండగుడు అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భార్య భర్తలు ఇద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ లంగర్ హౌస్ దగ్గర చోటుచేసుకుంది. మొనా, దినేష్ దంపతులకు ప్రేరణ, ధృతి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మత్తులో చిత్తై ఈ తాగుబోతు చేసిన యాక్సిడెంట్ ఆ పసివాళ్లను అనాథలుగా మిగిల్చింది. Also Read: బిగ్ బాస్ ట్విస్ట్ .. ఆ నలుగురికి బ్లాక్ టికెట్స్..! డబుల్ ఎలిమినేషన్ గంటలో వస్తామని చెప్పిన తల్లిదండ్రులు ఇక లేరని తెలియడంతో ఆ పసివాళ్లు దిక్కులేనిస్థితిలో మిగిలిపోయారు. అమ్మ, నాన్న కావాలంటూ గుండెపగిలేలా ఏడుస్తున్నారు. రాత్రి అమ్మ, నాన్న బయటకెళ్ళి వచ్చాక ఎక్కడికైనా వెల్దామని అనుకున్నాము అని తల్లిదండ్రులను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నాన్న రక్తపు మడుగులో ఉన్నాడు.. అమ్మ నోట్లో నుంచి ఏదో వస్తుంది అంటూ చెబుతున్న ఆ పసివాళ్ల మాటలు హృదయవిదారకం. తాము అనాథలుగా మారడానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మందుబాబులు మద్యం మత్తులో రోడ్లపై విచ్చలవిడిగా డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలను కోల్పోతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి