ధనుష్ తో వివాదం.. దెబ్బకు సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేసిన నయనతార భర్త నయనతార భర్త విగ్నేష్ శివన్ సోషల్ మీడియా నుంచి వైదొలిగాడు. దీనికి ధనుష్ ఫ్యాన్స్ కారణం అని తెలుస్తోంది. ధనుష్ ఫ్యాన్స్ విగ్నేష్ ను ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ తాకిడి తట్టుకోలేకే విఘ్నేష్ తన సోషల్ మీడియా ఖాతాను డిలీట్ చేసి ఉంటాడనే టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 01 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కోలీవుడ్ స్టార్స్ ధనుష్ - నయనతార మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. నయనతార పెళ్లి, జీవిత విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. అందులో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు. ఆ క్లిప్పింగ్‌ను డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఇటీవల ఈ కేసు విషయమై ధనుష్ కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంపై ఇప్పటికే కోలీవుడ్ రెండు గ్రూప్‌లుగా విడిపోయి కొందరూ నయన్‌కు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు ధనుష్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి తరుణంలో నయనతార భర్త విగ్నేష్ శివన్ సోషల్ మీడియా నుంచి వైదొలిగాడు. Also Read : కాబోయే కోడలికి నాగార్జున కాస్ట్లీ గిఫ్ట్.. ఏంటో తెలుసా? దీనికి ధనుష్ ఫ్యాన్స్ కారణం అని తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్ మాట్లాడుతూ.. అజిత్ 'ఎంతవాడు గాని' సినిమా కోసం తాను పాటలు రాశానని.. నేను డైరెక్ట్ చేసిన 'నేను రౌడీనే' మూవీ చూసి తనను మెచ్చుకున్నారని తెలిపాడు. కారణం అదేనా? అయితే ఈ కామెంట్స్ పై ధనుష్ ఫ్యాన్స్ విగ్నేష్ ను ట్రోల్ చేస్తున్నారు.' నేను రౌడీనే విడుదల కావడానికి ముందే ఎంతవాడు గాని విడుదల కావడంతో అజిత్ ఎలా నీ సినిమా చూస్తాడు? అబద్దాలు చెబుతున్నావు,ధనుష్ తొలి మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా నీకు లేదని' నెటిజన్లు విఘ్నేశ్‌ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. దీంతో వాళ్ళ తాకిడి తట్టుకోలేకే విఘ్నేష్ తన సోషల్ మీడియా ఖాతాను డిలీట్ చేసి ఉంటాడనే టాక్ వినిపిస్తోంది. Also Read: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం #vignesh-shivan #danush మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి