Nagarjuna : కాబోయే కోడలికి నాగార్జున కాస్ట్లీ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

నాగార్జున.. కాబోయే కోడలికోసం ఓ ఖరీదైన బహుమతి కొన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన 2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు.అది శోభితకి బహుమతిగా ఇవ్వడం కోసమే అనే టాక్ వినిపిస్తోంది. దీనితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాల్ని కూడా బహుమతిగా ఇవ్వబోతున్నారట.

New Update
nag (1)

అక్కినేని వారింట పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే. నాగ చైతన్య - శోభిత డిసెంబర్ 4 న పెళ్లి చేసుకోబోతున్నారు. రెండు రోజుల క్రితమే మంగళ స్నానాలు కూడా జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలను శోభిత స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక పెళ్ళికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

కోడలి కోసం కాస్ట్లీ కార్..

అదే సమయంలో కాబోయే కోడలికి అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి బహుమతులు ఇవ్వనున్నారనే చర్చ మొదలయ్యింది. ఈ క్రమంలోనే నాగార్జున.. తన కోడలి కోసం ఇటీవల ఓ ఖరీదైన బహుమతి కొన్నట్లు తెలుస్తోంది. నాగార్జున రీసెంట్ గా రూ.2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు. అది శోభితకి బహుమతిగా ఇవ్వడం కోసమే కొన్నారనే టాక్ వినిపిస్తోంది. 

Also Read: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం

దీనితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాల్ని కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ బహుమతిగా ఇవ్వబోతున్నారట. వాటి ఖరీదు కూడా కొన్ని కోట్లల్లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాగచైతన్య-శోభితల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా పెళ్లి జరగనుంది. డిసెంబరు 4న రాత్రి 8.13 నిమిషాలకు వారిద్దరూ ఒకటి కానున్నారు. ఈ పెళ్ళికి కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని ఆహ్వానిస్తున్నట్లు నాగ్‌ ఇప్పటికే ప్రకటించారు. తెలుగు సాంప్రదాయ పద్ధతిలోనే వీరి పెళ్లి జరగనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు