Sonia Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ మరలా అస్వస్థత

కాంగ్రెస్ మాజీ అధినేత్రి, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ మరలా అస్వస్థత పాలయ్యారు. కడుపుకు సంబంధించిన అనారోగ్యంతో ఆమె ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

New Update
Sonia Gandhi

Sonia Gandhi

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ ఈ మధ్య తరుచుగా అనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా మరోసారి ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. కడుపుకు సంబంధించిన ప్రాబ్లెమ్ తో సోనియా ఢిల్లీలోని శ్రీగంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం డాక్టరల్ అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తున్నా..ఈ మధ్య కాలంలో తరుచుగా సోనియా అనారోగ్యం పాలవడం కాంగ్రెస్ వర్గాలకు ఆందోళన కలిగించే విషయంగా మారింది. 

ఈ నెలలో ఇది రెండవసారి..

అంతకు ముందు జూన్ 7న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల క్రితం సిమ్లాలోని ప్రియాంకా గాంధీ నివాసానికి వెళ్లిన సోనియా ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది . దీంతో ఆమెను స్థానిక ఇందిరా గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. 

Also Read: ఆ వంతెన కూలడానికి కారణం అదే.. అజిత్ పవార్

Advertisment
తాజా కథనాలు