మా ఎమ్మెల్యేలకు ఎన్సీపీలో చేరాలని రూ. కోట్లు ఆఫర్ చేశారు: కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చేరాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల డబ్బులు ఆఫర్ చేశారని కాంగ్రెస్ మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్ రమేష్ చెన్నితాల తెలిపారు.

Ajit pawar
New Update

మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార, విపక్ష కూటమిలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చేరాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల డబ్బులు ఆఫర్ చేశారని కాంగ్రెస్ మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్ రమేష్ చెన్నితాల తెలిపారు. ఇది నేరపూరిత చర్య అని.. ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందని పేర్కొన్నారు. హోంశాఖ బాధ్యతలను చూస్తున్న ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు.. ఆయన స్పందించాలని నిలదీశారు.

Also Read: అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమీ చేయలేదు.. షర్మిల కంటతడి

అయితే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఎన్సీపీ ఇంకా స్పందించలేదు. ఇదిలాఉండగా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఇటీవల 48 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను కాంగ్రెస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే గురువారం 23 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వసంత్ పుర్కే రాలేగావ్, శివాజీరావ్ మోఘే కుమారుడు జితేంద్ర పేర్లు ఆ లిస్ట్‌లో ఉన్నాయి. 

ఏక్‌నాథ్ షిండేకు పోటీగా ఎవరంటే ?

మరోవైపు మహా వికాస్ అఘాడీ కూటమిలో సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి వచ్చింది. శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్‌పీ), కాంగ్రెస్ పార్టీలు 85 స్థానాల చొప్పున పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక శివసేన (యూబీటీ)కూడా 65 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. సీఎం ఏక్‌నాథ్ షిండే కోప్రీ-పచ్‌పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. ముంబయిలోని వర్లి నుంచి మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే బరిలోకి దిగనున్నారు. ఇక కోప్రీ-పాచ్‌పఖాడి స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే.. తన రాజకీయ గురువు అయిన ఆనంద్ దిఘే సోదరుడి కుమారుడు కేదార్‌ దిఘేను బరిలోకి దింపారు. 

Also Read:  కోతికి యావజ్జీవ శిక్ష.. ఎందుకో తెలుసా..?

నవంబర్ 20న ఎన్నికలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 20న ఒకే దశలో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మహాయుతీ, మహావికాస్ అఘాడీ కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. 2022లో శివసేన పార్టీ రెండుగా విడిపోయిన తర్వాత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం అయ్యారు. అయితే ఈసారి ఆ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో అనేదానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.  

#telugu-news #national-news #maharashtra election 2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe