Monkeys: కోతికి యావజ్జీవ శిక్ష.. ఎందుకో తెలుసా..?

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో కనిపించిన ప్రతి ఒక్కరిపై కలువ అనే కోతి దాడి చేస్తుంది. ఇప్పటి వరకు 250 మందికిపైగా గాయపడ్డారు, వారిలో ఒకరు మరణించారు. బయటకు వదిలేస్తే ప్రజలపై దాడులు చేస్తుందని దానిని జీవితాంతం జైలులోనే ఉంచాలని అధికారులు నిర్ణయించారు.

New Update
Monkeys

Monkeys

Monkeys: సాధారణంగా కోతులు కొంటె స్వభావం కలిగి ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ ఒక కోతి మాత్రం చాలా ప్రమాదకరమైనది. అందుకే దీనికి జీవిత ఖైదు విధించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో నివసించే ఈ కోతి పేరు కలువ. ఇది కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేస్తుంది. అందుకే ఇది అంటే ఆ ప్రాంతంలో అందరూ భయంతో వణికిపోతారు. ఇతరులపై దాడి చేయడమే కాకుండా మద్యం సేవించడం, మాంసం తినడం కూడా ఈ కోతికి అలవాటు. కలువ చిన్నప్పటి నుంచి తాంత్రికుడి దగ్గరే పెరిగింది. తినడానికి మద్యం, మాంసాహారం ఇచ్చేవాడని, అయితే తాంత్రికుడు చనిపోవడంతో కలువ ఒంటరిగా మిగిలిపోయిందని చెబుతారు. 

జీవిత ఖైదిగా పడిన మొదటి కోతి..

మద్యం, మాంసాహారం అందకపోవడంతో కోపంతో ప్రజలపై దాడి చేసి కొరికేదని అంటున్నారు. ఇప్పటి వరకు కలువ దాడిలో 250 మందికి పైగా గాయపడ్డారు, వారిలో ఒకరు మరణించారు. కలువ చాలా మంది అమ్మాయిల ముఖాలను తీవ్రంగా గాయపరిచింది. చివరికి వాళ్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. కలువ దాడులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో దాన్ని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎంతో కష్టపడి కలువను బంధించి బోనులో పెట్టారు. తర్వాత కొన్ని నెలల పాటు బోనులోనే ఉంచి పర్యవేక్షించారు.

ఇది కూడా చదవండి: మన శరీరంలో మనకు తెలియని రహస్యాలు

దాని మైండ్‌సెట్‌ను మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ ఫలితాన్ని ఇవ్వలేదు. కోతి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. కలువ బోనులోనే 3 సంవత్సరాలు ఉంది. అయినా మారలేదు, మళ్లీ కనిపించినవారిపై దాడి చేసేది. అంతేకాకుండా ఇతర కోతులను కూడా గాయపర్చేది. కలువ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో, బయటకు వదిలేస్తే ప్రజలపై దాడులు చేస్తుందని దానిని జీవితాంతం జైలులోనే ఉంచాలని అధికారులు నిర్ణయించారు. జీవిత ఖైదు పడిన మొదటి కోతిగా కలువ నిలిచింది.

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

ఇది కూడా చదవండి: దీపావళి తేదీపై గందరగోళం..అసలు పండగ ఎప్పుడు?

Advertisment
తాజా కథనాలు