BIG BREAKING: ఢిల్లీ CM రేఖాగుప్తాపై దాడి

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడికి యత్నం జరిగింది. జన్ సున్వాయ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రిని గుర్తు తెలియని వ్యక్తి కొట్టారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
Attack on Delhi CM Rekha Gupta

Delhi CM Rekha Gupta

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై బుధవారం దాడి జరిగింది. సివిల్ లైన్స్‌లోని ఆమె అధికారిక నివాసంలో వారానికోసారి జరిగే 'జన్ సున్వై' కార్యక్రమంలో ఓ వ్యక్తి ఆమెను కొట్టాడని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. 35 ఏళ్లకు పైబడిన ఓ వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

అతను ముఖ్యమంత్రిపై దాడి చేయడానికి ముందు కొన్ని పత్రాలను ఆమెకు ఇచ్చాడు. తర్వాత సీఎం రేఖాగుప్తా జుట్టును లాగి చెంపదెబ్బ కొట్టాడు. ఆమెకు గాయాలైయ్యాయి. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా షాక్‌కు గురైయ్యారు. దాడి చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతను ఎందుకు ఆమెకు కొట్టాడు అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇదిలా ఉండగా, గుప్తాపై జరిగిన దాడిని బిజెపి ఢిల్లీ యూనిట్ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా తీవ్రంగా ఖండించారు. 

Advertisment
తాజా కథనాలు