RTV Exclusive: వామ్మో వరదలు.. ఎప్పుడు పడితే అప్పుడు వానలు.. కారణమేంటి? కేరళలోని వాయినాడ్ లో వరద బీభత్సం మరవక ముందే చెన్నై, బెంగళూరులో వరదలు ముంచెత్తాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, విజయవాడలోనూ ఊహించని వరదలు వేల కోట్ల నష్టాలన్ని మిగిల్చాయి. ఎప్పుడు లేనంతగా ఈ సారి ఎందుకు ఇలా జరుగుతోంది? వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి By B Aravind 18 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసుకున్న చాలావరకు వరదలే సంభవిస్తున్నాయి. వీటి ప్రభావానికి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్, చైనా, అమెరికా, జపాన్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఇలా అనేక దేశాలు వరదలతో వణికిపోయాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే అత్యధిక వర్షాలు కురిసినప్పటికీ.. గ్లోబల్ వార్మింగ్ పెరగడం స్థిరమైన ఉష్ణోగ్రతల పెరుగుదలకు దారితీసిందని అంచనా వేస్తున్నారు. Also Read: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే! సాధారణం కన్నా ఎక్కువ ఈఏడాది వర్షకాలం సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగా నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది దీర్ఘకాలిక సగటులో 108 శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు భారత్‌లో 934.8 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. సీజనల్ వర్షపాతం అయిన 868.6 మీ.మీ కన్నా ఇది ఎక్కువ. దేశంలో 729 జిల్లాల్లో.. 340 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 158 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక 48 జిల్లాల్లో ఇంకా ఎక్కువగా అత్యధిక వర్షపాతం రికార్డయ్యింది. ఇక 167 జిల్లాలు వర్షపాత లోటును ఎదుర్కొన్నాయి. మరో 11 జిల్లాల్లో అత్యంత వర్షపాత లోటు నమోదైంది. Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట గత ఐదేళ్లలో అత్యధిక సంఖ్యలో వర్షాలు గత ఐదేళ్లలో చూసుకుంటే ఈ ఏడాది జూన్ నెలలో రెండవ అత్యధిక సంఖ్యలో భారీ వర్షాలు కురిశాయి. జులైలో కూడా అత్యధిక సంఖ్యలో అత్యంత భారీ కురిశాయి. అలాగే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా భారీ సంఖ్యలో వర్షాలు కరిశాయి. క్లైమెట్ ట్రెండ్స్ ఫౌండర్, డైరెక్టర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 కరవు ఏడాది అయినా లేదా 2024లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతాలు వచ్చినా కూడా తీవ్రమైన వాతావరణ సంఘటనల్లో పెరుగుదల స్థిరంగా ఉందని తెలిపారు. Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా? మరోవైపు గ్లోబల్ వార్మింగ్ పెరుగుదలపై కూడా వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు కలిసికట్టుగా దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాతావరణ మార్పుల వల్లే అతి భారీ వర్షాలు, ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్నారు. అయితే ప్రపంచ దేశాలు 2050 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయిలోకి తీసుకురావాలనే లక్ష్యం పెట్టుకున్నాయి. అలాగే భూ వాతారవణ 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరగకూడదని కంకణం కట్టుకున్నాయి. అయినప్పటికీ చాలా దేశాల్లో పర్యవరణానికి హానీ కలిగేలా అడవులను నరికివేయడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరీ 2050 నాటికి ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాల్సిందే. Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్ #telugu-news #heavy-rains #floods #global-warming మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి