Nambala Keshav Rao: కేశవరావు శవం ఇచ్చేది లేదు.. కశ్మీర్ విధానంలో అంత్యక్రియలు.. పోలీసుల సంచలన నిర్ణయం!

మావోయిస్టు నంబల కేశవ్ రావు మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు ఛత్తీష్ గఢ్ పోలీసులు అంగీకరించట్లేదు. ఏపీ హైకోర్టు చెప్పినా ప్రజల్లో అతన్ని హీరోగా చూడటం ఇష్టంలేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ విధానంలో అంత్యక్రియలు జరిపించాలని చూస్తున్నారట. 

New Update
Nambala Keshav Rao

Nambala Keshav Rao

Maoist: మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబల కేశవ్ రావు అలియాస్ బసవరాజు మృతదేహాన్ని ఆయన కుటుంబానికి అప్పగించేందుకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. ఆయన బంధువులు బహిరంగంగా అంత్యక్రియలు నిర్వహించడం వల్ల భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో వందలాది మంది భద్రతా సిబ్బంది, అమాయక గిరిజనులను దారుణంగా హత్య చేసిన కేశవ్ రావుకు ఘనంగా ఉరేగింపు చేసి, నివాళులు అర్పించడం అనవసరమని భావిస్తున్నారట. 

ఆ అంశాలను పరిశీలించిన తర్వాతే..

కేశవ్ రావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఆయన సవతి తల్లి, సోదరులు బతికి ఉన్నారని ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఏపీలో అంత్యక్రియలు నిర్వహించడంకోసం ఆయన సోదరుడు,  కొంతమంది బంధువులు గత కొన్ని రోజులుగా ఛత్తీస్‌గఢ్ పోలీసులను సంప్రదించారట. అయితే డెడ్ బాడీ అప్పగింతపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు తుది నిర్ణయం తీసుకునే ముందు కొన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

'హీరోకు వీడ్కోలు'..

ఈ అంశంలో చత్తీష్ గఢ్ పోలీసులు జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక సూచన తీసుకోవచ్చని సీనియర్ అధికారులు సూచించారు. అక్కడ 2019 నుండి ప్రామాణిక పద్ధతి ప్రకారం.. భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించరు. పోలీసులే కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో శ్మశానవాటికలలో ఖననం చేస్తారు. ఉగ్రవాదుల అంత్యక్రియల సమయంలో వారి స్వగ్రామాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించే ధోరణికి స్వస్తి చెప్పేందుకు ఇలా చేస్తారు. ఇక కేశవ్ రాజు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన బంధువులను అక్కడే ఉంచి, ప్రజలకంటపడకుండా పోలీసులే వారి సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. దీనివల్ల శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకుండా చూడొచ్చు. అంత్యక్రియల్లో 'హీరోకు వీడ్కోలు'అని భావించకుండా జాగ్రత్తపడొచ్చు అని ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

నారాయణపూర్ ఆపరేషన్‌లో మరణించిన 27 మంది మావోయిస్టులలో డజనుకు పైగా మృతదేహాలను ఛత్తీస్‌గఢ్‌లోని వారి బంధువులకు అప్పగించారు. బసవరాజు హోదా కలిగిన నాయకుడు. అతనొక్కడి బాడీనే ఇలా చేయడం మంచిది కాదని ఒక పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. 'బసవరాజుకు ఆంధ్రప్రదేశ్‌లోని తన కుటుంబంతో నాలుగు దశాబ్దాలకు పైగా ఎటువంటి సంబంధం లేకపోవచ్చు. అతని మృతదేహాన్ని క్లెయిమ్ చేస్తున్న బంధువులు ఎవరూ గతంలో CPI (మావోయిస్ట్)తో అతని సంబంధాన్ని అంగీకరించలేదు. మీడియాతో మాట్లాడలేదు. పోలీసుల నిర్భందాలను ఎదుర్కొన్నప్పుడు వారు బసవరాజును బంధువుగా తిరస్కరించారు. అతని హింసాత్మక మార్గాల నుండి దూరంగా ఉన్నారు అని మరో అధికారి చెప్పారు.

ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

Nambala kesavarao | chattisaghad | telugu-news | today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు