ఆ ఊరిలో దీపావళి వేడుకలు లేవు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. పటాసుల మోతతో అంతటా సందడి వాతావరణం నెలకొంది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ మాత్రం ఈ పండుగకు దూరంగా ఉంది. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 31 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. పటాసుల మోతతో అంతటా సందడి వాతావరణం నెలకొంది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ మాత్రం ఈ పండుగకు దూరంగా ఉంది. గతంలో సతీసహగమనానికి గురైన ఓ మహిళ శాపం వల్ల దీపావళి పండుగను అక్కడ జరుపుకోకూడదనే ఆచారం కొనసాగుతూనే ఉంది. ఇంతకీ వీళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే. Also Read: ఒక్క అంగుళం కూడా వదులుకోం.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు పండగ రోజే భర్త మరణం ఇక వివరాల్లోకి వెళ్తే.. చాలా ఏళ్ల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీన్‌పుర్ జిల్లా సమ్మూ గ్రామానికి చెందిన ఓ మహిళ దీపావళి పండుగ కోసం తన పుట్టింటికి బయలుదేరింది. అయితే ఆలోపే రాజు ఆస్థానంలో పనిచేస్తున్న తన భర్త చనిపోయాడనే మరణవార్త వచ్చింది. అప్పటికే గర్భిణిగా ఉన్న ఆమె ఒక్కసారిగా షాకైపోయింది. ఆ బాధను భరించలేక భర్త చితిపైనే ఆత్మార్పణం చేసుకుంది. ఆత్మార్పణ చేసుకునే ముందు దీపావళి పండుగ చేసుకోవద్దని శాపం పెట్టింది. దీంతో అప్పటి నుంచి ఆ ఊరిలో పండగను నిర్వహించడం లేదు. Also Read: TCS ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఇక 15 ఏళ్ల పాటు నో టెన్షన్! ఒకవేళ దీపావళి చేసుకుంటే ఊరికి ఏదో ఒక అపశకునం జరుగుతుందని ఊరి ప్రజలు భయపడుతున్నారు. అంతేకాదు ఆ గ్రామానికి చెందిన వాళ్లు ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా పండగను చేసుకోరు. ప్రత్యేకంగా వంటలు కూడా చేసుకోరు. అయితే ఓ కుటుంబం ఇలా చేసేందుకు ప్రయత్నించగా.. వాళ్ల ఇల్లు అగ్నికి కాలిపోయిందని అక్కడి వారు చెబుతున్నారు. దీంతో అప్పటి నుంచి ఆ ఊరు దీపావళికి దూరంగా ఉంటోంది. అయితే ఇక్కడున్న యువత మాత్రం ఏదో ఓ రోజు దీపావళిని చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. #telugu-news #deepavali #himachal-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి