కేంద్రం సంచలన నిర్ణయం.. పోర్ట్‌ బ్లెయిర్‌ పేరు మార్పు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్‌ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్‌ పేరును 'శ్రీ విజయ పురం'గా నామకరణం చేసింది. వలసవాదుల ముద్రల నుంచి విముక్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

Port Blair
New Update

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్‌ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్‌ పేరును 'శ్రీ విజయ పురం'గా నామకరణం చేసింది. దేశంలో వలసవాదుల ముద్రల నుంచి విముక్తి చేసేందుకు మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోర్ట్‌ బ్లెయిర్‌ అనేది అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశ మార్గంలోనే ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ నావీ అధికారి క్యాప్టెన్ అర్చిబాల్డ్ బ్లెయిర్‌ మరణించాక.. ఆయన జ్ఞాపకార్థం ఈ పట్టణానికి పోర్ట్‌ బ్లెయిర్ అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా మోదీ సర్కార్‌ ఆ పేరును మార్చి 'శ్రీ విజయ పురం'గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా 'ఎక్స్‌'లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.

Also Read: రావుస్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ ఘటన.. నిందితులకు బెయిల్‌

'' వలసవాదుల ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే పీఎం మోదీ స్పూర్తితో పోర్ట్ బ్లెయిర్‌కు 'శ్రీ విజయ పురం' పేరు పెట్టాలని నిర్ణయించాం. గతంలో ఈ ప్రాంతానికి ఉన్న పేరు వలసవాదాన్ని సూచిస్తోంది. శ్రీ విజయ పురం అనేది స్వాతంత్య్ర పోరాటంలో సాధించిన విజయాన్ని, అండమాన్‌ నికోబార్ దీవుల ప్రత్యేక పాత్రకు చిహ్నంగా నిలుస్తుంది. స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అండమాన్ నికోబార్ దీవులకు అసమానమైన స్థానం ఉంది. ఈ దీవుల ప్రాంతం గతంలో చోలా సామ్రాజ్యానికి నౌక స్థావరంగా ఉండేది. ఈరోజు ఈ ప్రాంతం మన వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలక స్థావరంగా నిలిచింది. నేతాజి సుభాష్ చంద్రబోస్‌ మొదటి సారిగా మన జెండాను ఆవిష్కరించిన ప్రదేశం కూడా ఇదే. అక్కడ ఉన్న సెల్యులార్ జైల్లో వీర్‌ సావర్కర్, ఇతర పోరాట యోధులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం దేశారు'' అని అమిత్‌ షా పేర్కొన్నారు.

#telugu-news #bjp #amit-shah
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe