వచ్చే ఏడాది జరగనున్న 10,12 తరగతుల బోర్డు పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గిస్తారని, పలు సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహిస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు జరిగాయి. అయితే వీటిపై తాజాగా సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు స్పందించింది. ఈ వార్తలు అవాస్తవం అంటూ కొట్టిపారేసింది. ఇలాంటి ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించింది. వచ్చే ఏడాది జరగబోయే పరీక్షల్లో సీబీఎస్‌ఈ ఎలాంటి మార్పులు చేయలేదని ఓ ప్రకటనలో పేర్కొంది.
Also Read: చెత్త వేస్తే చలానా.. ఫొటో తీసి మరీ పట్టుకుంటారు.. GHMC నయా యాప్ రెడీ!
2025 బోర్డు పరీక్షలకు సంబంధించి తాము అటువంటి నోటిఫికేషన్ ఏదీ కూడా విడుదల చేయలేదంటూ స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తమ అధికారిక వెబ్‌సైట్‌లోనే వివరిస్తామని పేర్కొంది. అందువల్ల ఇలాంటి తప్పుదోవ పట్టించే అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచనలు చేసింది.
Also Read: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!
ఇదిలాఉండగా.. 10,12వ తరగతి పరీక్షలకు సంబంధించిన డేట్‌షీట్లను మరికొన్ని రోజుల్లోనే సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేయనుంది. సాధారణంగా ప్రతీ సంవత్సరం నవంబర్ నాటికి ఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. గత ట్రెండ్స్‌ను చూస్తే.. ఈసారి కూడా ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!
Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!