/rtv/media/media_files/2024/12/24/6wsPz9dN35yof9pTHaMd.jpg)
CBI Photograph: (Google)
ఎన్ఏఏసీ రేటింగ్స్ కోసం చాలా విద్యా సంస్థలు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. దేశంలో ఒకేసారి చాలా రాష్ట్రాల్లో, చాలా విద్యాసంస్థల్లో రైడ్స్ చేసింది. చెన్నై, విజయవాడ, బెంగళూరు, భోపాల్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు చేసింది. ఈక్రమంలో 10 మంది ఎన్ఏఏసీ అధికారులను సీబీఐ అదుపు లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గుంటూరుకు చెందిన ఓ యూనివర్సిటీ ఉద్యోగులను కూడా అరెస్ట్ చేశారని సమాచారం.
డబ్బులు, వస్తువులు స్వాధీనం..
విద్యాసంస్థలు నగదు, బంగారం, సెల్ ఫోన్లు.. ల్యాప్ ట్యాప్‌ల రూపంలో లంచాలు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారి దగ్గర నుంచి రూ. 37 లక్షలు, 6 ల్యాప్ ట్యాప్‌లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటూ పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు సీబీఐ అధికారులు.
Also Read: GST: జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు...ఎంత వచ్చిందంటే..