అమెరికాలోనే అతి పెద్ద విమాన సంస్థ అమెరికన్ ఎయిర్ లైన్స్. సాంకేతిక సమస్య కారణంగా ఈ విమాన సేవలు నిలిచిపోయాయి. దాదాపు రెండు గంటలకు పైగా విమానాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. కొన్ని ఫ్లైట్‌లను రద్దు కూడా చేయాల్సి కూడా వచ్చింది. ఈరోజు ఉదయం ఈ సమస్య ఏర్పడింది. రేపు క్రిస్మస్...దీంతో చాలా మంది ఈరోజు ప్రయాణాలు పట్టుకున్నారు. ఇప్పుడు విమానాలు నిలిచిపోవడంతో వారందరూ తీవ్ర నిరాశకు లోనయ్యారు. తాము అర్జంటుగా వెళ్ళాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటిలోనే.. దీనికి సంబంధించిన పలువురు సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెట్టారు. మరోవైపు విమానాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నామని అమెరికన్ ఎయిర్ లైన్స్ చెప్పింది. ప్రయాణికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కొంతసేపటిలోనే విమానాలు అన్నీ ప్రయాణిస్తాయని హామీ ఇచ్చారు. అయితే సాంకేతిక సమస్య ఏంటన్నది మాత్రం అమెరికన్ ఎయిర్ లైన్స్ తెలుపలేదు. అనేక మంది ప్రయాణికులతో విమానాలు వివిధ విమానాశ్రయాల్లో రన్‌వేపై ఇరుక్కుపోయాయని తెలిపింది. తిరిగి పంపిస్తున్నట్లు మాత్రం పేర్కొంది. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని ఎక్స్ ట్విట్టర్‌లో కంపెనీ తెలిపింది. Also Read: Kadapa: కలిసిన విజయమ్మ, జగన్.. పులివెందులలో క్రిస్మస్ సంబరాలు!