UNO: యుద్ధం చేస్తే శవాలే మిగులుతాయి..ఉత్తర కొరియాకు అమెరికా హెచ్చరిక

రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా బలగాలు వెళ్ళడం మీద ఐక్యరాజ్యసమితిలో పెద్ద చర్చ జరిగింది. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లయితే.. వారి బాడీలు బ్యాగ్‌లలో తిరిగివెళ్తాయి అని అమెరికా హెచ్చరించింది. 

New Update
korea

North Korea In Russia-Ukrain War: 

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా ప్రవేశించిదన్న వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా బలగాలు మాస్కో వెళ్ళాయి. దీని మీద విపరీతంగా వ్యతిరేకత వస్తోంది. అమెరికా అయితే దీని మీద చాలా సీరియస్ అవుతోంది ఈ విషయం మీద. ఈరోజు ఉత్తర కొరియా యుద్ధంలోకి వెళ్ళడంపై ఐక్యరాజ్య సమితిలో చర్చ జరిగింది. ఇందులో అమెరికా, ఉత్తర కొరియా అంబాసిడర్ల మధ్య మాట యుద్ధం జరిగింది. ఒకటి, రెండు సార్లు ఆలోచించి బరిలోకి దిగాలంటూ అమెరికా డిప్యూటీ అంబాసిడర్ రాబర్డ్ వుడ్ అన్నారు. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లయితే.. వారి బాడీలు బ్యాగ్‌లలో తిరిగివెళ్తాయని హెచ్చరించారు.

ఆ తరువాత కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మీద పెద్ద మాట యుద్ధమే నడిచింది. ఉక్రెయిన్‌కు మిగతా అన్ని దేశాలు సాయం వెళుతున్నప్పుడు రష్యాకు ఉత్తర కొరియా వంటి మిత్రదేశాలు సహాయం అందించకూడదా అంటూ ఐక్యరాజ్యసమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ప్రశ్నించారు. అయితే దీనిపై కీవ్ రాయబారి కూడా స్పందించారు. ఉక్రెయిన్‌కు సహాయం అందించే దేశాలు భద్రతామండలి ఆంక్షలను ఉల్లంఘించలేదన్నారు. అయితే రష్యాకు తమ దళాలను పంపుతున్నట్లు ఉత్తరకొరియా మాత్రం వరకు అంగీకరించలేదు. కానీ అమెరికా, పాశ్చాత్య దేశాలు..ష్యా సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలు బహిర్గతం చేయడం, బెదిరింపులకు పాల్పడితే.. మేము వాటికి సమాధానం ఇస్తామని ఉత్తర కొరియా రాయబారి అన్నారు. పోంగ్యాంగ్‌, మాస్కో పరస్పర భద్రత, అభివృద్ధిపై సన్నిహిత సంబంధాన్ని కలిగిఉన్నాయని చెప్పారు.

Also Read: సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ..

Advertisment
Advertisment
తాజా కథనాలు