దేశవ్యాప్తంగా 60 స్కూళ్లలో బాంబు.. రెచ్చిపోయిన దుండగులు!

దేశ రాజ‌ధాని ఢిల్లీతోపాటు బెంగుళూర్ నగరాల్లో శుక్రవారం పదుల సంఖ్యలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. అలాగే బెంగుళూరులో 40 ప్రైవేట్ స్కూళ్లకు కూడా బెదిరింపులు వచ్చాయి.

New Update
Bomb threats

దేశ రాజ‌ధాని ఢిల్లీతోపాటు బెంగుళూర్ నగరాల్లో శుక్రవారం పదుల సంఖ్యలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. బాంబు నిర్వీర్య బృందాలు త‌నిఖీలు చేస్తున్నాయి. అనేక స్కూళ్ల వ‌ద్ద స్క్వాడ్స్ ఉన్నాయి. బాంబు బెదిరింపు మెయిల్ వ‌చ్చిన స్కూళ్లలో సివిల్ లైన్స్‌లోని సెయింట్ గ్జావియ‌ర్స్, ప‌శ్చిమ్ విహార్‌లోని రిచ్‌మండ్ గ్లోబ‌ల్ స్కూల్‌, రోహిణిలోని అభిన‌వ్ ప‌బ్లిక్ స్కూల్‌, ద సావిరిన్ స్కూల్ ఉన్నాయి. 


సెయింట్ స్టీఫెన్స్ కాలేజీకి ఈరోజు ఉద‌యం 7.15 నిమిషాల‌కు ఈమెయిల్ వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. స్కూల్ క్యాంప‌స్‌లో 4 ఐఈడీలు, 2 ప్యాకెట్ల ఆర్డీఎక్స్ అమ‌ర్చిన‌ట్లు బెదిరించారు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల లోపు అవి పేల‌నున్నట్లు మెయిల్ లో పేర్కొన్నారు. 

 అలాగే బెంగుళూరులోని స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. సిటీలోని దాదాపు 40 ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. RR న‌గ‌ర్‌తో పాటు కేన్‌గిరిలో ఉన్న స్కూళ్లకు కూడా బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. బెదిరింపు మెయిల్స్ రావ‌డంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళ‌న‌కు గుర‌య్యారు. పోలీసులు వెంటనే త‌నిఖీ బృందాల‌ను ఏర్పాటు చేశారు. 
 Delhi Schools

Advertisment
Advertisment
తాజా కథనాలు