Love jihad : లవ్ జిహాద్.. బయటకు ఈడ్చుకొచ్చి ఊతికారేసిన బీజేపీ మహిళా లీడర్!

లవ్ జిహాద్ ఆరోపణల నేపథ్యంలో ఓ సెలూన్ షాపుపై దాడి చేశారు బీజేపీ కార్యకర్తలు. ఈ సెలూన్ షాపులో పనిచేసే హిందూ అమ్మాయిని బలవంతంగా ముస్లిం మతంలోకి మారాలంటూ ఒత్తిడి చేశాడంటూ అర్మాన్ ఖాన్ అనే ముస్లిం అబ్బాయిని చితకబాదారు.

New Update
love-jihad-bjp

love-jihad-bjp

లవ్ జిహాద్ ఆరోపణల నేపథ్యంలో ఓ సెలూన్ షాపుపై దాడి చేశారు బీజేపీ కార్యకర్తలు. ఈ సెలూన్ షాపులో పనిచేసే హిందూ అమ్మాయిని బలవంతంగా ముస్లిం మతంలోకి మారాలంటూ ఒత్తిడి చేశాడంటూ అర్మాన్ ఖాన్ అనే ముస్లిం అబ్బాయిని చితకబాదారు. ఈ ఘటన పూణేలోని కోత్రుడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోవైరల్ గా మారింది.   బీజేపీ మహిళా మోర్చా కార్యకర్త ఉజ్వల గౌడ్ తన పార్టీ కార్యకర్తలతో కలిసి, అర్ష్ యునిసెక్స్ సెలూన్‌లోకి ప్రవేశించి, కస్టమర్లను బయటకు పంపించి అర్మాన్ ఖాన్ ను బయటకు ఈడ్చుకొచ్చి మరి దాడి చేశారు.  అర్మాన్ ఖాన్ అనే ముస్లిం అబ్బాయి బలవంతంగా ఓ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలి నుండి తమకు ఫిర్యాదు అందిందని.. ఇష్టానికి విరుద్ధంగా ఇస్లాం మారాలని ఒత్తిడి చేస్తున్నాడని, ఆ అమ్మాయి మాట్లాడకుండా ఉండటానికి లక్ష రూపాయల కూడా చెల్లించినట్లుగా బాధితురాలు చెప్పినట్లుగా ఉజ్వల గౌడ్ ఆరోపించారు.  సెలూన్ మూసివేయాలంటూ  యజమాని జావేద్ పై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు.  

ఏడాది క్రితం పెళ్లి

అయితే లవ్ జిహాద్ కోణాన్ని పోలీసులు ఖండించారు. సెలూన్ యజమానికి, సంబంధిత మహిళకు మధ్య ఆర్థిక వివాదం ఉందని కోత్రుడ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) సందీప్ దేశ్మనే స్పష్టం చేశారు. "ఆమెను బలవంతంగా కల్మా పారాయణం చేయించారని సూచించడానికి ఎటువంటి సాంకేతిక ఆధారాలు కనుగొనబడలేదు " అని తెలిపారు. తాము ఆమె వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగా, వీడియోలో రికార్డ్ చేసామన్నారు పోలీసులు. ప్రాథమిక సమాచారం ప్రకారం  సెలూన్‌లో అర్మాన్, అమ్మాయికి ఏడాది క్రితం పెళ్లి జరిగింది. అయితే డబ్బు విషయంలో దంపతుల మధ్య వివాదం నెలకొంది. దీని తర్వాత అమ్మాయి ఒక స్నేహితుడిని సంప్రదించింది, ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. అయితే, ఈ ఘటనలో ఆ అమ్మాయి హిందువు కాదని, క్రైస్తవురాలని తేలిందని పోలీసులు చెబుతున్నారు.  

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు