2027లోనే జమిలి ఎన్నికలు.. సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం !

దేశంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే 2027లో భారత్‌లో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

Jamili elections 2
New Update

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని గత కొంతకాలంగా బీజేపీ చెబుతోన్న సంగతి తెలిసిందే. ఇటీల కేంద్ర కేబినెట్ కూడా వన్ నేషన్- వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. వచ్చే శీతాకాలం పార్లమెంటులో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనికి సంబంధించి తాజాగా మరో కీలక విషయం బయటపడింది. 2027లో భారత్‌లో మొత్తం ఒకేసారి ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

5 ఆర్టికల్స్ సవరణ చేయాలి

జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై గతంలోనే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ కూడా పూర్తిస్థాయిలో పరిశీలన జరిపింది. తాను రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా అందజేసింది. అయితే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్ సవరణ చేయాలని ఈ కమిటీ తెలిపింది. ఆర్టికల్ 83,85,172,174,356లను బిల్లు ద్వారా సవరణ చేయాలని సూచనలు చేసింది. 

Also Read: మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?

67 శాతం సభ్యుల మద్ధతు అవసరం

అయితే ఈ బిల్లు ఆమోదం పొందాలంటే కొన్ని పరిణామాలు జరగాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ కావాలంటే.. లోక్‌సభ, రాజ్యసభలో 67 శాతం మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలపాలి. అలాగే 14 రాష్ట్ర అసెంబ్లీలు సైతం మద్దతు ఇవ్వాలి. ఇలా జరిగితేనే ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుంది. తద్వారా జమిలీ ఎన్నికలకు మార్గం సుగమమవుతుంది. ఒకవేల పార్లమెంటులో లేదా రాష్ట్రాల నుంచి మద్దతు దొరకకపోతే ఈ బిల్లు ఆమోదం సాధ్య కాదు. 

Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?

2027 టార్గెట్

ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు లభించినట్లైతే 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశం మొత్తం ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే ఈ ఎన్నికలు జరిగిన 100 రోజుల తర్వాత మున్సిపల్, గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు.  దేశంలో పరిపాలన సౌలభ్యం కోసమే ఈ జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ ఘోషి తెలిపారు.  

ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, జమ్మూకశ్మీర్‌ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటికి 2029 వరకు పాలించే హక్కు ఉంటుంది. అలాగే త్వరలో మహారాష్ట్ర, ఝార్ఖండ్, వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాష్ట్రాలు తమకు మిగిలి ఉన్న పాలనాకాలాన్ని రద్దు చేసుకొని జమిలీ ఎన్నికలకు మద్దతిస్తాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

Also Read: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

ప్రాంతీయ పార్టీలకు నష్టం !

అయితే మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. దీనివల్ల జమిలీ ఎన్నికలు సాధ్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2027లో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రాంతీయ పార్టీ అస్థిత్వానికి దెబ్బపడుతుందని మరికొందరు అంటున్నారు. జమిలీ ఎన్నికల్లో రాష్ట్రాల సమస్యలు కాకుండా జాతీయ సమస్యలపైనే ఓటర్ల దృష్టి మళ్లుతుందని.. దీనివల్ల బీజేపీ పార్టీకే అనుకూలంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నారు. మరీ జమిలీ ఎన్నికలు జరుగుతాయా ? లేదా ? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే. వచ్చే శీతాకాల సమావేశంలో దీనిపై ఓ స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. 

Also Read: వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే?

#telugu-news #national-news #jamili-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe