/rtv/media/media_files/2025/02/10/xM4SgIObhhxuUU8reyg8.jpg)
Arvind Kejriwal's Sheesh Mahal
Sheesh Mahal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఢిల్లీకి కొత్త సీఎం రానున్నారు. అయితే ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ నివాసం ఉన్న శీష్ మహల్ అంశం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ వార్త ప్రచారం అవుతోంది. ఢిల్లీ కొత్త సీఎం శీష్ మహల్‌లో నివాసం ఉండకపోవచ్చని సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ భవనాన్ని అధికారిక నివాలంగా వినియోగించేవారు.
Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే
ఆ బంగ్లాను శీష్ మహల్ (అద్దాల మేడ) అంటూ బీజేపీ ఆరోపించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్ దీన్ని 7 స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారంటూ విమర్శలు చేసింది. మరోవైపు ప్రధాని మోదీ ఓ సభలో మాట్లాడుతూ తాను 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించానని.. కానీ తాను మాత్రం ఇల్లు కట్టకోలేదని కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. ఆప్ అవినీతికి శీష్ మహల్ ఓ ఉదాహరణ అని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించింది.
Also Read: కష్టాన్ని ఇష్టంగా చేసుకోండి.. విద్యార్థులతో ప్రధాని ఇంట్రెస్టింగ్ చిట్ చాట్
శీష్ మహాల్‌కు దూరంగా
ఆప్ సర్కార్‌పై బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపించాయి. చివరికీ ఈ ఎన్నికల్లో 48 స్థానాల్లో బీజేపీ గెలవగా.. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమైపోయింది. అయితే ఇలా విమర్శలకు కారణమైన శీష్ మహల్‌లో ఢిల్లీ కొత్త సీఎం ఉండకోవచ్చని తెలుస్తోంది. ఇక్కడ కాకుండా సీఎం అధికారిక నివాసాన్ని వేరే చోటుకి మార్చాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: పేరెంట్స్ సె**క్స్ పై ప్రశ్న దుమారం.. క్షమాపణ చెప్పిన యూట్యూబర్!
Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?