/rtv/media/media_files/2025/11/14/nithish-2025-11-14-11-32-37.jpg)
ఈసారి కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అయ్యేట్టున్నారు. ఇప్పటి వరకు ఫలితాలను బట్టి చూస్తూ ఆయన పార్టీ జేడీయూ అందరిని తోసుకుంటూ ముందుకు పరుగెడుతోంది. 82 స్థానాలలో ఆధిక్యంతో పై చేయిగా ఉంది. దీని తరువాత ప్లేస్ లో బీజేపీ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఓవరాల్ గా ఎన్డీయే కూటమి గెలుస్తుంది. అదే ప్రభుత్వాన్ని స్థాపి్తుంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం జేడీయే పార్టీ అభ్యర్థి నితీశ్ కుమారే అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
బీజేపీ ఆశలు గల్లంతు..
ఈ ట్రెండ్ ఒక రకంగా బీజేపీకి గట్టి దెబ్బే అని చెప్పాలి. అసలు తమ సీఎం అభ్యర్ధిని ఎన్డీయే ప్రకటించలేదు. ఫలితాలు వచ్చాక నిర్ణయిస్తామని తెలిపింది. కానీ బిహార్‌కుఅత్యధిక కాలం సీఎంగా సేవలు అందించిన 74 ఏళ్ల నితీశ్ కుమార్‌కు మరో ఛాన్స్ ఇవ్వకూడదని బీజేపీ వర్గాలు అనుకుంటున్నాయి. నితీష్ మా ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తారు. ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ముందుగా తమ తమ పార్టీ నాయకులను ఎన్నుకుంటారు. తర్వాత వారు కలిసి కూర్చుని తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయిస్తారు అని హోంమంత్రి అమిత్ షా ఒకసారి చెప్పారు. దీంతో నితీశ్ కు బీజేపీ ధోకా ఇవ్వడం ఖాయం అనే ప్రచారం చాలానే జరిగింది. దీనిని బీజేపీ, అమిత్ షా ఖండించినా...నితీశ్ కుమారే మా సీఎం అభ్యర్ధి అని మాత్రం గట్టిగా చెప్పలేదు. అసలు సారి ఎన్నికలలో బీజేపీ ఆధిక్యం సాధిస్తుందని ఆ పార్టీ నమ్మకంగా ఉంది. కానీ బీహార్ ప్రజల తీర్పు మరోలా ఉంది. చాలా ఏళ్ళుగా సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ కే తమ ఓటు అని చెప్పారు. తుది ఫలితాల్లో జకూడా జేడీయూనే ఆధిక్యంలో ఉంటే కచ్చింగా ఆయనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీ అడ్డు చెప్పడానికి కూడా ఏమీ ఉండదు అనేది వాస్తవం.
Follow Us