/rtv/media/media_files/2025/11/12/fotojet-74-2025-11-12-18-07-37.jpg)
Bihar Axis My India Exit Polls
BIG BREAKING: బీహార్‌లో ఎన్నికలు ముగిశాయి. కాగా రాష్ట్ర చరిత్రలో తొలిసారి 68.99 శాతంతో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఈ రికార్డు స్థాయి పోలింగ్ ఏ పార్టీకి లాభం..? అనే చర్చ మొదలైంది. అధికార కూటమికే జనం మళ్లీ పట్టం కట్టారని పలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లను దాటే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. ప్రతిపక్ష మహాగట్ బంధన్‌కు మరోసారి నిరాశే మిగిలే అవకాశం ఉందని పోల్స్ చెబుతున్నాయి.100 సీట్లకు అటూ ఇటూగానే రావచ్చని అంచనా వేస్తున్నాయి.
అయితే వీటన్నింటికి భిన్నంగా యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్ పోల్ ఉంది. బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాగట్ బంధన్‌కు100కు పైగా సీట్లు లభిస్తాయని చెబుతోంది. ఎన్డీఏ, ఎంజీబీ మధ్య కేవలం మూడు శాతం మాత్రమే ఓట్ల తేడా ఉండే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. అంతేకాదు బీహార్ తర్వాతి ముఖ్యమంత్రిగా నితిష్‌కుమార్ కంటే తేజస్వీ యాదవ్ నే ఎక్కవమంది కోరుకుంటున్నట్లు బాంబ్ పేల్చింది.అలాగే ఎన్నికల్లో పురుషులు ఎన్డీఏ వైపు మొగ్గు చూపితే, స్త్రీలు ఎంజీబీ వైపు మొగ్గు చూపారని తెలిపింది.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 121 నుంచి 140 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రెండు విడతల్లో జరిగిన బిహార్ ఎన్నికల పోలింగ్ రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైంది.
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎక్కువ మంది పాత ఓటర్లు ఏన్డీఏకి ఓటు వేయగా.. మొదటిసారి ఓటు వేస్తున్న యువత మహాఘాట్‌బంధన్‌కు ఓటు వేసినట్లు వెల్లడైంది. బిహార్ అధికార పీఠం మరోసారి ఎన్డీయేకే దక్కబోతున్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి.
ఎన్డీఏ కూటమి- 121 నుంచి 140 స్థానాలు
ఇండియా కూటమి-98 నుంచి 118 స్థానాలు
జన్ స్వరాజ్ పార్టీ- 0 నుంచి 2
ఇతరులు- ఒకటి నుంచి ఏడు స్థానాలు
పార్టీల వారీగా..
బీజేపీ 50 నుంచి 56
జెడియు 56 నుంచి 62
ఎల్ జె పి 11 నుంచి 16
ఇతరులు నాలుగు నుంచి ఏడు
మహాఘాట్ బంధన్
ఆర్జేడీ 67 నుంచి 76
కాంగ్రెస్ 17 నుంచి 21
విఐపీ 3 నుంచి 5
ఇతరులు 10 నుంచి 1
Follow Us