Supreme Court : స్టాండప్ కామెడీయన్లకు బిగ్‌ షాక్‌..సుప్రీం కోర్టు సీరియస్‌ వార్నింగ్‌

సోషల్‌ మీడియాలో వికలాంగుల హక్కులపై అవగాహన కలిపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోకులు వేసే కమెడియన్లకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

New Update
Supreme court

Supreme court

Supreme Court :  సోషల్‌ మీడియాలో వికలాంగుల హక్కులపై అవగాహన కలిపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోకులు వేసే కమెడియన్లకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. వికలాంగులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులను అవమానించే రీతిలో ట్రోలింగ్‌ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. వారిని కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్‌ఎంఏ క్యూర్ ఫౌండేషన్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువరించింది. ప్రముఖ స్టాండప్ కమెడియన్లు సమయ్ రైనా, విపున్ గోయల్, ట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా లాంటి వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ  ఎస్‌ఎంఏ క్యూర్ ఫౌండేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులను టార్గెట్ చేయడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.  

 అంతేకాక తమ షోలలో అనుచితంగా దివ్యాంగులపై అనుచిత కామెడీ చేసినందుకుగాను తమ సోషల్ మీడియాలతో పాటు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. సమయ్ రైనా, విపున్ గోయల్‌తో పాటు బలరాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలి టక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్‌లకు  కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పిటిషన్లతో కలిపి దీన్ని విచారించింది సుప్రీం కోర్టు.

విచారణ సందర్భంగా ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హాస్యం జీవితంలో భాగమే అయినా, అది ఇతరులను ఎగతాళి చేయడానికి ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడింది. సమాజంలో దివ్యాంగులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు లాంటి విభిన్న వర్గాల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈరోజు టార్గెట్ దివ్యాంగులు అయితే, రేపు ఇతర వర్గాలు కావొచ్చని. ఇది ఇంతటితో ఎక్కడ ఆగుతుంది? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హక్కులు, బాధ్యతల మధ్య సమతుల్యత అవసరమని జస్టిస్ జెకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.

  సమాజంలోని కొన్ని వర్గాలను బాధపెట్టడానికి కామెడీని ఉపయోగించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో వికలాంగులతో సహా ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడే లక్ష్యంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో భాషను ఉపయోగించాలని కోరింది. దానికోసం సమగ్ర మార్గదర్శకాలను సిద్ధం చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు ఒకే సంఘటనకు మాత్రమే పరిమితంగా కాకూడదని, సాంకేతిక పురోగతి వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో ఉండాలని కోర్టు సూచించింది. కాగా సంబంధిత నియమాలను రూపొందించేటప్పుడు జాతీయ వికలాంగుల సంక్షేమ బోర్డు (ఎన్‌బీడీఎస్ఏ)తో పాటు ఇతరులను సంప్రదించాలని మంత్రిత్వ శాఖకు సూచించింది. ఇలాంటివి భవిష్యత్తులోనూ జరిగితే జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి:లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!

Advertisment
తాజా కథనాలు