APJ Abdul Kalam : అబ్దుల్ కలాం తిరుపతికి వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా.. ఇంకా మర్చిపోని శ్రీవారి భక్తులు!

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం..రూల్స్ ను తూచా తప్పకుండా పాటించేవారు. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈయనను శ్రీవారి భక్తులు ఇందుకే ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. దానికి కారణం ఆయన తిరుమలను దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ సమర్పించడమే.

author-image
By Manogna alamuru
New Update
1

APJ Abdul Kalam Birth Anniversary : 

రాష్ట్రపతి పదవిని చేపట్టినా సామాన్యుడిలాగే జీవితం గడిపిన కలామ్ అందరికీ ఆదర్శనీయం. ఇలాంటి కలాంను ఇంకోసారి చూడలేం అంటే అతిశయోక్తి కాదేమో. భారత 11వ రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచిన అబ్దుల్ కలాం..అజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోవడమే కాకుండా.. తన జీవితాన్ని దేశానికే అంకితం చేశారు.

Also Read: Bengaluru: దర్శన్ బెయిల్‌ను మళ్ళీ కొట్టేసిన బెంగళూరు కోర్టు

మిస్సైల్ మ్యాన్...

అవుల్ ఫకీర్ జైనులద్దీన్ అబ్దుల్ కలామ్ తమిళనాడులోని రామేశ్వరంలో 1931 అక్టోబరు 15న జన్మించారు. నిరుపేద ముస్లిం కుటుంబంలో పుట్టిన కలామ్, బాల్యంలోనే అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రాథమిక విద్య తరువాత తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి ఇంటర్, మద్రాస్ ఇన్సిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. చదువు తర్వాత  డీఆర్డీఓ, ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు. ఇక్కడే కలాం బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఈ కృషికి గుర్తుగానే ఆయనకు మిస్సైల్ మాన్ అని బిరుదు ఇచ్చారు. అంతేకాదు 1998లో పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలక పాత్ర కూడా పోషించారు. దీని తరువాత 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా కలామ్‌ను బీజేపీ ప్రతిపాదించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఆయనకు మద్దతు తెలిపింది. ఈ ఎన్నికలలో వామపక్షాలు అభ్యర్థి లక్ష్మీ సెహగల్‌పై విజయం సాధించి 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.

Also Read: బుద్ధి పోనిచ్చుకోని కెనడా..అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త

పిల్లలకు, యవతకు స్ఫూర్తి..

అబ్దుల్ కలాం ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తారు.  పిల్లలకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కలాం. కలలు కనండి..నిజం చేసుకోండి అంటూ పిల్లలకు, యువతకు  ఆయన ఇచ్చిన   సందేశం ఇప్పటికీ ఎందరిలోనో స్పూర్తిని నింపుతూనే ఉంది. పిల్లలకు సైన్స్ ఎగ్జిబిషన్లు, స్పోర్ట్స్‌ డే...ఏదైనా సరే స్కూల్స్‌కి వెళ్లి మరీ పిల్లల్ని ప్రోత్సహించేవారు. ఆయన ఈమెయిల్ ఐడీని పిల్లలకు ఇచ్చి ఎవరైనా తనకు మెయిల్ చేస్తే రిప్లై ఇచ్చేవారు. ఏపీజే అబ్దుల్ కలాంకు పిల్లల మీద ఉన్న ప్రేమను, ప్రోత్సాహన్ని గుర్తించిన ప్రపంచ దేశాలు కలాం పుట్టిన రోజు అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి.

Also Read: పడింది దెబ్బ..అదానీ ప్రాజెక్టుపై శ్రీలంక ప్రభుత్వం పున:పరిశీలన

భారత రత్న...

భారత్ తయారు చేసిన పలు మిసైల్స్‌ వెనక అబ్దుల్ కలాం మాస్టర్‌ మైండ్‌ ఎంతో ఉంది. అగ్ని, పృథ్వి లాంటి క్షిపణులు తయారు చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వాటి అభివృద్ధి నుంచి ప్రయోగించేంత వరకూ అన్నింట్లోనూ ఆయన మేధాశక్తి ఉంది. అందుకే భారతదేశం ఆయనను అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(1997), పద్మభూషణ్ (1981), పద్మ విభూషణ్ (1990)తో సహా అనేక అవార్డులతో సత్కరించుకుంది. ఇవి కాక కలాం 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లు పొందారు. అవినీతిని నిర్మూలించేందుకు మే 2012లో కలాం వాట్ కెన్ ఐ గివ్ మూవ్మెంట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అబ్దుల్ కలామ్ జూలై 27, 2015న, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ షిల్లాంగ్‌లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ తర్వాత తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

Also Read: Canada: ఆరుగురు భారత దౌత్యవేత్తలను బహిష్కరించిన కెనడా

Advertisment
తాజా కథనాలు