మీరు సూపర్‌స్టార్ రజనీకాంత్ హిరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ బాషా సినిమా చూశారా ?. అందులో రజినికాంత్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తాడు. ఓ సీన్‌లో ఆటో ఎక్కిన హిరోయిన్ డైమాండ్స్ ఉన్న బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రజినీకాంత్ ఆ బ్యాగ్‌లో ఏముందో చూడకుండానే హిరోయిన్ ఇంటికి వెళ్లి తిరిగి ఇచ్చేస్తాడు. అయితే తాజాగా ఇలా భాషా సినిమా సీన్‌ను తలపించే ఓ ఘటన జరిగింది. ఓ మహిళా తాను ఎక్కిన ఆటోలో బంగారు గొలుసును మర్చిపోయి దిగి వెళ్లిపోయింది. ఆ తర్వాత దీన్ని గమనించిన ఆ ఆటో డ్రైవర్ ఆమె ఇంటికి వెళ్లి దాన్ని ఇచ్చేశాడు.
Also Read: దేశంలో జనగణన.. తెలంగాణ, ఏపీతో పాటు ఆ రాష్ట్రాలకు ఊహించని దెబ్బ !
ఇక వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని గిరీష్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల మైసూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ మహిళ గిరీష్ ఆటోలో ప్రయాణం చేసింది. గమ్యస్థానం చేరుకున్నాక ఆమె ఆటో దిగి ఇంటికి వెళ్లిపోయింది. కానీ ఆ ఆటోలోనే ఆ మహిళ బంగారు గొలుసు పడిపోయింది. దీన్ని గమనించకుండానే ఆమె వెళ్లిపోయింది. అయితే గిరీష్ రైడ్ అయిపోయాక తన ఇంటికి వెళ్లిపోయాడు. రోజులాగే ఆటోను చెక్ చేసుకోగా అతనికి బంగారు గోలుసు కనిపించింది.
Also Read: డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..
తన ఆటోలో ప్రయాణించిన ఆ మహిళదే ఈ బంగారు గోలుసు అని గిరీష్‌కు అర్థమైంది. దీంతో ఆమె ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి ఆ బంగారు గొలుసు ఆమెకు అప్పగించాడు. దీంతో ఆ మహిళా గిరీష్ చేసిన పనికి చాలా సంతోషం వ్యక్తం చేసింది. అతడి మంచితనాన్ని పొగడ్తలతో ముంచెత్తింది. వాస్తవానికి ఆటో అగ్రిగేటర్ నగరా మీటర్డ్ అనే ఆటో యూనియన్‌లో గిరీష్ మెంబర్‌గా ఉన్నారు. తమ ఆటోలో ప్రయణించే కస్టమర్ల భద్రత కోసం స్ట్రీట్ హైల్డ్ నగారా మీటర్ ఆటో ట్రిప్‌ల పేరుతో ఈ యూనియన్ సభ్యులు వారి ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ఈ విధానం వల్ల కస్టమర్లు తమ ఆటోలో ఏవైనా వస్తువులు మర్చిపోతే వాళ్ల ఇంటిని కనుగొని అప్పగించేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం గిరీష్ చేసిన పని సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో నెటీజన్లు ప్రశంసిస్తున్నారు.