Year Ender 2024:వేల కోట్లను నష్టపోయిన బ్యాంకులు..వాటి లిస్ట్ ఇదే..

2024 ఏడాది బ్యాంకులకు కష్టకాలమనే చెప్పాలి. ఈ యేడు చాలా బ్యాంకులు నష్టపోయాయి. ప్రధానంగా నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ పెరగడం, రుణ వసూలు సమస్యలు, నకిలీ లావాదేవీలు, అవినీతి కారణంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయో తెలుసా..

New Update
Banks: పలు బ్యాంకుల్లో మే నుంచి కొత్త రూల్స్..

2024 సంవత్సరం బ్యాంకులకు అస్సలు కలిసి రాలేదు. చాలా బ్యాంకులు ఆర్ధికంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇందులో పబ్లిక్, ప్రవైట్ రంగానికి చెందిన రెండు బ్యాంకులూ ఉన్నాయి. ఈ సంవత్సరం బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. నకిలీ లావాదేవీలు, రిస్క్ మేనేజ్‌మెంట్ లోపాలు, ఆర్థిక అడ్డంకులు, మార్కెట్ ఇంతకు ముందు కంటే ఏకంగా మార్పులు చెందడం వంటి అంశాలు ఉన్నాయి.  దీంతో బ్యాంకులు ఎదుర్కొన్న సమస్యలు, వాటి ఆర్థిక పరిస్థితులు, పునరుద్ధరణ విధానాలపై ప్రస్తుతం అందరూ దృష్టి పెడుతున్నారు. 

ఆర్థిక అస్థిరత..

ఇంతకు ముందు కంటే భారతదేశం ఆర్ధికంగా మరింత ఎక్కువ అభివృద్ధి చెందుతోంది. దాంతో పాటూ అస్థిరతకు కూడా లోనవుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థలో అనేక సంక్షోభాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకులలో వడ్డీ రేట్ల పెరుగుదల, గ్లోబల్ మార్కెట్ అస్థిరత, కస్టమర్ డిమాండ్ పడిపోయిన తగ్గుదల లాంటి కారణాలు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని మరింత క్షీణపరిచాయి.

నేరాలు...

బ్యాంకింగ్ నేరాలు ఈ ఏడాది చాలా పెరిగిపోయాయి. పెద్ద పెద్ద బ్యాంకులు సైతం ఆర్ధిక నేరాలు, అవినీతిలో కూరుకుపోతున్నాయి.  కొంతమంది బ్యాంకులు మోసం, దోపిడీ కారణంగా నష్టాలు భరించారు. దానికి తోడు బ్యాంకులకు తక్కువ కస్టమర్ డిపాజిట్లు, పెద్ద రుణాల తిరిగి చెల్లింపుల లోపాలతో ఈ నష్టాలను మరింత పెంచాయి.

అత్యధిక రుణ వసూలు..

ఈ ఏడాది చాలా బ్యాంకులు తమ రుణాలను వసూలు చేయడంలో కష్టాలను ఎదుర్కొన్నాయి. 2024లో బ్యాడ్ డెబ్ట్, ఎన్పీయేలు పెరిగాయి. దీంతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. 

పెట్టుబడులు..

పెట్టుబడులు పెట్టడానికి నియమాలు మారాయి. ఇప్పుడు అవి మరింత కఠిన తరం అయ్యాయి. అలాగే పరిమితులు కూడా పెరిగాయి. దీంతో బ్యాంకుల పెట్టుబడుల దారి మళ్లించడంతోపాటు కొత్త రుణాలను మంజూరు చేయడంలో కూడా ఆటంకాలు సృష్టించాయి.


2024లో బ్యాంకుల రుణ విక్రయాలు 12% పెరిగాయి. అయితే బ్యాడ్ డెబ్ట్‌ల పెరిగిన కారణంగా బ్యాంకులు తమ రుణ వ్యాపారంలో పెద్ద నష్టాలను భరించాల్సి వచ్చింది. పీఎన్బీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఎన్పీయేల విషయంలో గట్టిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి మెరుగుపర్చడానికి ఆర్బీఐ నడుం బిగించింది. 2025లో బ్యాంకింగ్ రంగం పరిస్థితినిచక్కదిద్దడానికి భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు కొత్త విధానాలను అమలు చేయాలని భావిస్తున్నాయి. ఈ విధానాల వల్ల బ్యాంకుల నష్టాలు తగ్గించే అవకాశం ఉందని అంటున్నాయి.  ఆధునిక సాంకేతికత, డిజిటల్ ట్రాన్సాక్షన్లు, రిస్క్ మేనేజ్‌మెంట్ టూల్స్‌ను ఉపయోగించి బ్యాంకులు మరింత బలోపేతం చేయనున్నారు.


2024లో నష్టపోయిన బ్యాంకులు...

పంజాబ్ నేషనల్ బ్యాంక్..

ఈ ఏడాది ఈ బ్యాంకు 10 వేల కోట్లు నష్టపోయింది. తమకు చెల్లించాల్సిన రుణాలు తిరిగి చెల్లించకపోవడం, గతంలో జరిగిన ఆర్ధిక నేరాల కారణంగా పీఎన్‌బీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. 

యాక్సిస్ బ్యాంక్..

ఈ బ్యాంకు ఈ ఏడాది 8 వేల కోట్లు నష్టపోయింది. ఎన్పీయేలు పెరగడం, రుణాలు చెల్లించకపోవడం వలనే నష్టపోయామని బ్యాంకు ప్రకటించింది. 

ఐసిఐసిఐ బ్యాంక్:

ఈ బ్యాంక్ 4,500 కోట్ల రూపాయల నష్టాన్న అనౌన్స్ చేసింది. మార్కెట్ అస్థిరత, అధిక రిస్క్ రుణాలు, లెగసీ, ఎన్పీయేలు కారణాలుగా చూపించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా :

బ్యాడ్ డెబ్ట్ పెరిగిన కారణంగా ఈ బ్యాంకు 3,000 కోట్ల రూపాయల నష్టాన్ని భరించింది. దీనికి కూడా కారణం ఎన్పీయేలు పెరగడం, లావాదేవీల లోపాలే ప్రధాన కారణాలని చెప్పారు. 


యునియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:

1,500 కోట్ల రూపాయల నష్టం ప్రకటించిన ఈ బ్యాంకు మార్కెట్ అస్థిరత, రుణ వసూలు సమస్యలు, బ్యాడ్ డెబ్ట్‌లతో తీవ్రంగా నష్టపోయాన చెప్పింది.

 


 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు