BYJU'S : ఐయామ్ సారీ..జీతాలు చెల్లించలేకపోతున్నా...ఎంప్లాయిస్కు బైజూస్ రవీంద్రన్ లేఖ.!
కొంతమంది ఇన్వెస్టర్ల కారణంగా జీతాలు చెల్లించలేకపోతున్నా అని బైజూస్ ఉద్యోగులకు సీఈవో రవీంద్రన్ లేఖ రాశారు. మార్చి 10వ తేదీలోగా జీతాలు చెల్లించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని లేఖలో పేర్కొన్నారు. కొన్ని వివాదాల వల్ల వేరే అకౌంట్లో నిధులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు.