Abu Azmi: ఔరంగజేబు వివాదం.. అబూ అజ్మీకి అఖిలేష్ యాదవ్ మద్దతు!

ఔరంగజేబు వివాదంలో ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీకి అఖిలేష్ యాదవ్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి అబూని సస్పెండ్ చేసి సత్యం, జ్ఞానాన్ని అదుపు చేయలేరన్నారు. తమ నేతల తెలివి, నిర్భయం సాటిలేనిదని కొనియాడారు. 

New Update
Aurangzeb

Aurangzeb controversy Akhilesh Yadav support to Abu Azmi

Abu Azmi: ఔరంగజేబు వివాదంలో ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీకి అఖిలేష్ యాదవ్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీని నుంచి అబూని సస్పెండ్ చేసి సత్యం, జ్ఞానాన్ని అదుపు చేయలేరన్నారు. తన నేతల నిర్భయం, జ్ఞానం సాటిలేనిదని కొనియాడారు.

Also Read: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..

సస్పెన్షన్ ద్వారా నిజాన్ని దాచలేరు..

ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఔరంగజేబును సమర్థించినందుకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. కాగా దీనిపై పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. తన ఎమ్మెల్యే అబూ అజ్మీకి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. సస్పెన్షన్ ద్వారా నిజాన్ని, జనాల నాలుకలను అదుపు చేయవచ్చని కొంతమంది అనుకుంటే అదివారిపొరపాటే అన్నారు. సస్పెన్షన్ ఆధారంగా భావజాలం ప్రభావితమవదు. అలా జరిగితే భావ ప్రకటనా స్వేచ్ఛ, బానిసత్వానికి మధ్య తేడా ఏమిటి? మా మ్మెల్యేలు, ఎంపీల నిర్భయ జ్ఞానం సాటిలేనిది. ఇలాంటి స్వేచ్ఛా, ఆలోచన, బీజేపీ అవసరం లేదని చెబుతుంది అంటూ విమర్శలు గుప్పించారు. 

Also Read:  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

నా మాటలు వక్రీకరించబడ్డాయి..

అయితే ఈ వివాదంపై అబూ అజ్మీ వివరణ ఇచ్చాడు. శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ లకు వ్యతిరేకంగా మాట్లాడాలని తాను అనుకోలేదన్నాడు. నా మాటలు వక్రీకరించబడ్డాయి. ఔరంగజేబు గురించి చరిత్రకారులు, రచయితలు చెప్పినదే నేను చెప్పాను. నేను ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ లేదా మరే ఇతర గొప్ప వ్యక్తి గురించి ఎటువంటి అవమానకరమైన వ్యాఖ్య చేయలేదన్నారు. ఇక ఔరంగజేబుపై చేసిన ప్రకటనకు సంబంధించి అబూ అజ్మీపై మహారాష్ట్రలోని థానేలో కేసు నమోదైంది. అజ్మీ ఒక ప్రకటనలో ఔరంగజేబును సమర్థించాడనే ఆరోపణలున్నాయి. 17వ శతాబ్దపు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును క్రూరమైన, నిరంకుశ లేదా అసహన పాలకుడిగా పరిగణించను. ఈ రోజుల్లో మొఘల్ చక్రవర్తి చరిత్రను వక్రీకరించే చిత్రాలొస్తున్నాయి అని అబూ అన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Also Read:  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇదిలా ఉంటే.. మొఘల్ పాలకుడు ఔరంగజేబును ప్రశంసిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అబూ అజ్మీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను పార్టీ నుంచి తొలగించాలని పిలుపునిచ్చారు. ఆ వ్యక్తిని పార్టీ నుంచి తొలగించి ఉత్తరప్రదేశ్‌కు పంపండి. మేము అతనికి చికిత్స చేస్తాం అని ఆదిత్యనాథ్ అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు