/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-50.jpg)
గతేడాది ఇండియాకు ఒలింపిక్స్ పతకాలు తెచ్చిన వారిలో మను బాకర్ ఒకరు. ఈమెకు రెండు పతకాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పతకాలను వెనక్కు పంపించేయనున్నారు. వీటిపై ఉన్న పూత పోవడమే దీనికి కారణం. పాత వాటి జాగాలో కొత్తవి పంపిస్తామని ఐవోసీ చెప్పింది. అందుకే మనుబాకర్ పతకాలను ఐవోసికి పంపించనున్నామని భారత ఒలింపిక్స్ సంఘం తెలిపింది.
కాంస్య పతకం పాడవుతోంది...
కాంస్య పతకంపైనున్న పూత తొలగిపోతోందని మను బాకర్ చెబుతున్నారు. అది అసలు ఒలిపింక్స్‌లో వచ్చిన పతకం లాగనే కనిపించడం లేదని అన్నారు. ప్రస్తుతం దాన్ని ఇంట్లోని షోకేజ్‌లో పెట్టాం. అది మరింత పాడవుతుందనే భయంతో బయటకు తీయడం లేదని మను బాకర్ తండ్రి రామ్ కిషన్ మీడియాతో చెప్పారు. మరోవైపు స్వప్నిల్ కుశాలే, సరబ్‌జోత్ సింగ్‌ల పతకాలు కూడా మసకబారుతున్నట్లు తెలుస్తోంది. వీన్నింటినీ భారత లింపిక్స్ సంఘం లెటక్ చేసి ఒకేసారి ఐవోసికి పంపించుంది.
Also Read: Kallakkadal: కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు...
పతకాలు ఇచ్చి పది నెలలు కూడా కాలే.. అప్పుడే వాటి రంగు పోతుంది. 2024 జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు పారిస్ వేదికగా ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి. అందులో విజేతలకు 5,084 స్వర్ణం(గోల్డ్), రజత(సిల్వర్), కాంస్యం(బ్రౌంజ్) మెడల్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు వాటిలో కొన్ని పతకాలకు మెటల్ కోటింగ్ పోతుంది. దాదాపు 100 పతకాలు దాకా పాడైపోయాయి. మెడల్స్‌పై లోహపు పూత ఊడిపోయి దారుణంగా తయారయ్యాయి. దీంతో పారిస్ ఒలింపిక్స్ పతకాలపై విమర్శలు వస్తున్నాయి.
అయితే దీనిపై ఐవోసీ వెంటనే స్పందించింది. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటి లోపభూయిష్టమైయి మెడల్స్‌ను క్రీడాకారుల నుంచి తిరిగి తీసుకుంటోందని తెలిపింది. వాటికి బదులు కొత్త పతకాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఫ్రెంచ్ గవర్నమెంట్ మాత్రం మెడల్స్ నాసిరకంగా ఉన్నాయని వస్తున్న విమర్శలను ఖండించింది. గత ఆగస్ట్ నుంచే మెటల్ కోటింగ్ పోయిన పతకాలను రిప్లేస్ చేస్తున్నామని చెప్పింది. ఇప్పటివరకు పాడైపోయిన 100 మెడల్స్‌ను తీసుకొని వాటి ప్లేస్‌లో కొత్తవి ఇచ్చామని లా లెట్రె పత్రికకు అక్కడి ప్రభుత్వం చెప్పింది.
Also Read: India: రష్యాలో భారతీయుని మృతిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం..