BIG BREAKING : పాకిస్థాన్ కు సపోర్ట్ .. అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్!

పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని మోదీ, అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ కు సపోర్ట్ చేసిన, చేయడానికి ప్రయత్నించిన సహించబోమని సీఎం హిమంత అన్నారు. సదురు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

author-image
By Krishna
New Update
arrest mla assam

arrest mla assam

పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.  పాకిస్థాన్ కు సపోర్ట్ చేసిన, చేయడానికి ప్రయత్నించిన సహించబోమని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు.  సదురు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. "నేను వీడియోను చూశాను. ఇది పాకిస్తాన్‌ను సమర్థించే విధంగా పోస్ట్ చేసినట్లు కనిపిస్తోంది. నేను వెంటనే డీజీపీని చర్య తీసుకోవాలని ఆదేశించాను. రాజద్రోహం ఆరోపణలపై ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు" అని సీఎం అన్నారు.

Also Read :  హ్యాట్సాఫ్ అనన్య.. ఇది కూడా దేశభక్తే.. మెచ్చుకోకుండా ఉండలేం!

ఈ ఎటాక్స్ వెనుక మోదీ, అమిత్ షా

కాగా 2018లో కూడా పుల్వామా దాడిలో కూడా కేంద్రం పాత్ర ఉందని తాను నమ్ముతున్నానని..  అందుకే 2019 ఎన్నికల్లో బీజేపీ గెలించిందన్నారు. పుల్వామా దాడి లాగే పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రభుత్వ పాత్ర ఉందనే తాను అనుకుంటున్నానని తెలిపారు.  నిజం తేల్చాలని లేకపోతే ఈ ఎటాక్స్ వెనుక మోదీ, అమిత్ షాలు ఉన్నారని నమ్మాల్సి వస్తుందని అన్నారు.  ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అస్సాం పోలీసులు ఆయనపై సుమోటుగా కేసు నమోదు చేసి తాజాగా అరెస్ట్ చేశారు. 

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు