సెల్యూట్ ఆర్మీ డాక్టర్.. రైల్వేస్టేషన్‌లో రెండు ప్రాణాలను బ్రతికించాడు

పన్వెల్, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణీ ప్రసవ నొప్పులు వచ్చాయి. ఆమెను శనివారం మధ్యాహ్నం ఝాన్సీ స్టేషన్‌లో దింపేశారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లే టైం లేకపోవడంతో అక్కడే ఉన్న ఓ ఆర్మీ డాక్టర్ చిన్న కత్తి, ఎయిర్ పిన్ సహాయంతో డెలివరీ చేశాడు.

New Update
Army doctor

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో ఓ ఆర్మీ డాక్టర్ సమయస్పూర్తి ప్రదర్శించాడు. ఆయన రెండు ప్రాణాలను కాపాడాడు. ఎయిర్ పిన్‌తో నిండు ప్రాణాన్ని నిలబెట్టాడు. పన్వెల్, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణీ స్త్రీకి తీవ్రమైన ప్రసవ నొప్పి వచ్చింది. ఆమెను శనివారం మధ్యాహ్నం ఝాన్సీ స్టేషన్‌లో దింపివేసినట్లు నార్త్ సెంట్రల్ రైల్వే ఝాన్సీ డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీర్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లే టైం కూడా లేదు. దీంతో పురుటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న ఆమెను చూసి మహిళా టికెట్ కలెక్టర్ ఓ ఆర్మీ డాక్టర్‌ను తీసుకొచ్చారు.

ఎదో ఒకటి చేసిన ఆమె ప్రాణాలు కాపాడాలని కోరారు. దీంతో ఆ యువ మిలటరీ డాక్టర్ రైల్వే ప్లాట్ ఫారమ్‌నే ఆపరేషన్ థియేటర్‌గా మార్చాడు. ఒక హెయిర్ క్లిప్, పాకెట్ కత్తి వాడి సిజిరియన్ చేశాడు. ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తున్న మేజర్ డాక్టర్ రోహిత్ బచ్‌వాలా(31) రైలు కోసం ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్నాడు. అంతలోనే మహిళ వీల్ చైర్‌పై పురుటినొప్పులతో బాధపడుతుండటం చూశాడు. వెంటనే అతను రైల్వే సిబ్బంది సహాయంతో, ప్లాట్‌ఫారమ్‌లోనే డెలివరీ చేయాలనుకున్నాడు. బొడ్డు తాడును బిగించడానికి హెయిర్ క్లిప్‌ను ఉపయోగించాడు. శిశువు స్థిరంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత చిన్న కత్తితో ఆపరేషన్ చేశాడు.  ప్రసవం తర్వాత తల్లి, బిడ్డ ఇద్దరినీ అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. రైల్వే సిబ్బంది ఆయనకు సహాయం చేశారు. ప్రయాణీకులు ఆయన చేసిన పనికి ప్రసంచించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆర్మీ డాక్టర్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు