Toll Pass: రూ. 3 వేలతో ఏడాదికి టోల్ పాస్ లు ..బిగ్ ప్లాన్ లో కేంద్రం..

హైవేలను ఉపయోగించుకునే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక అస్తమానమూ..టోల్ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది. ఏడాది రూ.3వేలతో, జీవిత కాలపు రూ.30 వేలతో టోల్ పాస్ లను ప్రవేశపెట్టింది. 

New Update
Election Commission: కొత్త టోల్‌ రేట్లు ఎన్నికల తరువాతే: ఎన్నికల కమిషన్‌!

జాతీయ రహదారులను తరచుగా ఉపయోగించే మధ్య తరగతి మరియు ప్రైవేటు కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. టోల్ గేట్లను అపరిమితంగా ఉపయోగించుకునేందుకు స్కీమ్ లను ప్రవేశపెట్టింది.  జీవితకాలపు, ఏడాది టోల్ పాస్ లను ప్రవేశపెట్టింది. ఏడాది టోల్ పాల్ కోసం 3 వేలు రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. జీవిత కాలపు టోల్ పాస్ కోసం 30,000 రూపాయలు చెల్లించేలా కొత్త పాస్ లను తీసుకురానుంది. అయితే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రతీ వాహనం యొక్క జీవిత కాలం 15 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ జీవిత కాలపు పాస్ 15 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.

Also Read: TS: షాద్ నగర్ ప్రైవేట్ పాఠశాలలో ఘోరం..విద్యార్థి ఆత్మహత్య

అదిరిపోయే ఆఫర్..

ప్రస్తుతానికి టోల్ గేట్ దగ్గర అమౌంట్ పే చేయడానికి కేవలం నెలకు మాత్రమే పాస్ లు తీసుకునే వెసులుబాటు ఉంది. వీటిని పొందాలంటే వినియోగదారులు వారి అడ్రెస్ ప్రూఫ్ సహా మరిన్ని వివరాలను అందింస్తూ.. నెలకు రూ.340 చెల్లించాల్సి ఉండేది. అలాగే ఈ పాస్‌ను ఏడాది పాటు వాడుకుంటూ పోతే మొత్తంగా రూ.4,080 చెల్లించాల్సి వచ్చేది. దీనిని మరింత డెవలప్ చేస్తూ..వాహనదారులకు సౌలభ్యం చేకూరేలా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఏడాదికి, జీవితకాలానికి పాస్ తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించనుంది. అది కూడా ఏడాదికి కేవలం రూ. 3 వేలకు మాత్రమే లభించేలా ప్లాన్ చేయనుంది. దీంతో వాహనదారుల టైమ్, మనీ రెండూ సేవ్ అవనున్నాయి.  

Also Read: AP: మద్యం అమ్మకాలపై ఏపీలో సిట్ దర్యాప్తు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chandola Lake Demolition : 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!

చందోలా సరస్సు ప్రాంతంలో ఆక్రమణలుగా భావించిన 8,500 నిర్మాణాల కూల్చివేతను ఒకే రోజు పూర్తి చేసి, 2.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకుంది అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ ఆపరేషన్ లో 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు పాల్గొన్నారు.

New Update
Chandola lake demolition

హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా వెళ్తే  ఎలా ఉంటుందో అందరం చూసి ఉంటాం.  అంతకు మంచి  పదిరేట్ల  యాక్షన్ జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..  అవును ఇలాంటిది గుజరాత్ లో జరిగింది.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  50 బుల్డోజర్లు దండయాత్రకు బయలుదేరాయి. ఆక్రమణలను నిమిషాల వ్యవధిలోనే చూస్తుండగానే కూల్చివేశాయి.అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC)  అధికారులు మంగళవారం నాడు దానిలిమ్డాలోని చందోలా సరస్సును అక్రమంచ కట్టిన ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. 

8 వేల 500 ఇళ్లు కూల్చివేత 

ఒక్కరోజే ఏకంగా 8 వేల 500 ఇళ్లను కూల్చివేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింంది.  దీని ద్వారా అధికారులు  మొత్తం 2 లక్షల 50 వేల చదరపు మీటర్ల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ఇందులో 350 మంది సిబ్బంది పాల్గొని  మంగళవారం ఉదయం 7 గంటలకు పని ప్రారంభించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు 35 బుల్డోజర్లు, 15 మట్టిని తొలగించే యంత్రాలను మోహరించారు. కూల్చివేత సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి 3,000 మందికి పైగా పోలీసులు, రాష్ట్ర రిజర్వ్ పోలీసు (SRP) సిబ్బందిని మోహరించారు.  

చందోలా సరస్సు వద్ద అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం మున్సిపల్ కార్పొరేషన్ , నగర పోలీసులు ఏప్రిల్ 29 నుండి మే 1 వరకు మూడు రోజుల ఆపరేషన్ నిర్వహించారు, మొదటి దశలో కూల్చివేత జరిగింది. మొదటి రోజు ఫామ్‌హౌస్‌లు, గిడ్డంగులు , తాత్కాలిక నివాసాలతో సహా 1 లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని తొలగించారు. రెండవ రోజు 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు జరిగింది. చివరి రోజు ఘోడాసర్ సమీపంలోని 25 దుకాణాలు, సరస్సులోని వివిధ కట్టల పక్కన 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక పెద్ద గిడ్డంగితో సహా వాణిజ్య సంస్థలపై దృష్టి సారించింది. దాదాపు 99.9 శాతం ఆక్రమణలను కూల్చివేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.  కేవలం కొన్ని మతపరమైన కట్టడాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. 2010 కి ముందు నుంచి ఇక్కడ నివసిస్తున్న వారికి వసతి కల్పిస్తామని.. ఆ తర్వాత వచ్చిన వారు వెళ్లిపోవాల్సిందేనని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. 

 

Advertisment
Advertisment
Advertisment