/rtv/media/media_files/2025/04/14/aPqgkYugfugbeqKT51pY.jpg)
zodiac signs today
Today Rasi Phalalu: ఈ రోజు రాశి ఫలాలు ఇలా.....
మేష రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి స్నేహితులు సాయం చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. పిల్లల చదువు విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపార, ఉద్యోగాల్లో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
మిథున రాశి ఫలాలు
డబ్బు వ్యవహారాల్లో ఒడిదుడుకుగా తప్పవు. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారుతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాల్లో వివాదాలు వస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.
కర్కాటక రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అన్నదమ్ములతో మనస్పర్థలు కలగవచ్చు.
Also Read: Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!
సింహ రాశి ఫలాలు
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో ఏర్పడిన పరిచయాలతో లాభం పొందుతారు. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. నిరుద్యోగులకు అనుకూలం. వృత్తి, ఉద్యోగాల్లో సత్ఫలితాలు వస్తాయి.
కన్య రాశి ఫలాలు
కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
తుల రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగాలు నిదానం. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కలిసిరాదు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృథా ఖర్చులు ఉంటాయి. నూతన వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.
వృశ్చిక రాశి ఫలాలు
డబ్బు ఖర్చయ్యే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాల్లో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు.
ధనస్సు రాశి ఫలాలు
వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలం. పిల్లల చదువు విషయాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు.
Also Read: VIRAL VIDEO: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్
మకర రాశి ఫలాలు
దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది.
కుంభ రాశి ఫలాలు
నిరుద్యోగులకు అనుకూలం. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు బంధు మిత్రుమిత్రుల సహకారంతో పూర్తవుతాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికలతో విజయం సాధిస్తారు.
మీన రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగం విషయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. కొందరి ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది.