/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Investment-in-Gold-jpg.webp)
Akshaya Tritiya
Gold: అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోళ్లు గుర్తుకు వస్తాయి. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు ఆశాజనకంగా ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది అక్షయ తృతీయ రోజున 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73,500 ఉండగా.. ప్రస్తుతం రూ.1 లక్ష సమీపంలో ఉంది. వెండి కిలో ధర కూడా రూ.86,000 నుంచి ప్రస్తుతం రూ.99,800కు పెరిగింది. దీంతో కొనుగోలుదారులు బంగారం కొనడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే తక్కువ పరిమాణంలో కొనుగోళ్లు జరిగినా రూ. 12 వేల కోట్ల విలువైన 12 టన్నుల బంగారం, రూ. 4 వేల కోట్ల విలువైన 400 టన్నుల వెండి విక్రయాలు జరగవచ్చని, మొత్తంగా రూ.16 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్) అంచనా వేస్తోంది.
Also Read: 70 ఏళ్ల అమ్మమ్మ చీరలో ముస్తాబైన హీరోయిన్.. ఎంత అందంగా ఉందో! ఫొటోలు చూస్తే అంతే
సాధారణంగా అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి అమ్మకాలు పెరుగుతాయి. అయితే ధరలు బాగా పెరగడం వల్ల ఈఏడాది వినియోగదారుల కొనుగోలుపై ప్రభావం పడొచ్చని బంగారం వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది బంగారం ధరలు ఊహకందని స్థాయిలో పెరగడడంతో సామాన్యులు బంగారం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ముడి చమురు ధరలు, డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడటం, సురక్షితమైన ఆస్తిగా బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం బంగారం, వెండి ధరలను పెంచాయి. వీటికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు కూడా ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు జ్యువెలర్లు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. అయినప్పటికీ అధిక ధరలు డిమాండ్‌ను బలహీనపరిచే అవకాశాలు ఉన్నాయని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Minister Seethakka : ఆపరేషన్ కగార్ పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
గతేడాది అక్షయ తృతీయ రోజున రూ.73,500గా ఉన్న బంగారం ధరలు ప్రస్తుతం 10 గ్రాములు రూ.లక్షకు చేరుకున్నాయి. అదేవిధంగా, వెండి ధరలు కిలోగ్రాముకు రూ. 1,00,000కి చేరుకున్నాయి, 2023లో కిలోగ్రాముకు రూ.86,000గా ఉంది. సాధారణంగా, అక్షయ తృతీయ కొనుగోళ్లలో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. అయితే ఈ సంవత్సరం పెరిగిన ధరలు వినియోగదారుల డిమాండ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్