/rtv/media/media_files/2026/01/28/ajit-pawar-2026-01-28-16-52-05.jpg)
Ajit Pawar
Ajit Pawar: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అతనితో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి సరిగ్గా 26 నిమిషాల ముందు ఏం జరిగిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఉదయం 8:18 గంటలకు విమానం మొదటిసారి బారామతి ఏటీసీ (ATC)ని సంప్రదించి రన్‌వే 11పై దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. 8:42 నిమిషాల సమయంలో వాతావరణం సరిగ్గా లేకపోవడంతో రన్‌వే కనిపించడం లేదని పైలట్ తెలిపారు. దీంతో విమానం గాలిలో ఒక రౌండ్ వేసింది. రెండోసారి 8:43 నిమిషాలకు ప్రయత్నించినప్పుడు రన్‌వే కనిపిస్తోందని పైలట్ చెప్పారు. ఏటీసీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చింది. కానీ పైలట్ నుంచి మళ్లీ సమాధానం రాలేదు. సరిగ్గా 8:44 నిమిషాలకు రన్‌వే సమీపంలో మంటలు కనిపించాయి. విమానం కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు.
ఇది కూడా చూడండి: Ajith Pawar Plane Crash: అజిత్ పవార్ ప్రయాణించిన విమానం 'లీర్జెట్ 45' వివరాలు.. గతంలో కూడా ఇదే విమానానికి ఘోర ప్రమాదం!
కారణాలు ఇవేనా?
ల్యాండింగ్‌కు అనుమతి లభించిన నిమిషం వ్యవధిలోనే విమానం ఎందుకు అదృశ్యమైంది? పైలట్ నుంచి ఆఖరి క్షణంలో ఎందుకు సమాధానం రాలేదనే ప్రశ్న ఉంది. అలాగే ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? విమానం ఇంజిన్ ఫెయిల్యూర్ అయ్యిందా? లేక పక్షులు ఢీకొనడం వల్ల లేదా ఇంధనం లీక్ కావడం వల్ల మంటలు చెలరేగాయా? వాతావరణం అడ్డుపడిందా? అని దర్యాప్తు చేస్తున్నారు. విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు ల్యాండింగ్ ప్రయత్నం చేయడం సరైనదేనా? మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడే విమానాన్ని వేరే విమానాశ్రయానికి మళ్లించి ఉండాల్సిందా? అనే ప్రశ్నలు లెవనెత్తాయి. విమానం ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో లోపాలు తలెత్తాయా? రన్‌వే అంచున మంటలు ఎందుకు చెలరేగాయి? 15 వేల గంటల అనుభవం ఉన్న పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్, ల్యాండింగ్ సమయంలో ఏదైనా పొరపాటు చేశారా లేదా విమాన నియంత్రణ కోల్పోయారా? అనే ప్రశ్నలు లెవనెత్తాయి.
Follow Us