/rtv/media/media_files/2025/09/18/cm-nitish-kumar-2025-09-18-12-55-12.jpg)
BIG BREAKING: అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. 'ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయ్ భట్టా యోజన' కింద గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందిన నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1,000 చొప్పున రెండేళ్ల పాటు అందించనున్నట్లు ప్రకటించారు. గతంలో, ఈ పథకం ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు మాత్రమే వర్తించేది. అయితే దీనిని ఇప్పుడు డిగ్రీలు పొందిన నిరుద్యోగ యువతకు కూడా పొడిగించారు.
नवम्बर 2005 में नई सरकार बनने के बाद से ही अधिक से अधिक युवाओं को सरकारी नौकरी और रोजगार देना तथा उन्हें सशक्त और सक्षम बनाना हमलोगों की प्राथमिकता रही है। आप अवगत हैं कि अगले पांच साल में एक करोड़ युवाओं को सरकारी नौकरी और रोजगार देने का लक्ष्य निर्धारित किया गया है। आने वाले…
— Nitish Kumar (@NitishKumar) September 18, 2025
ఈ పథకానికి అర్హత సాధించాలంటే వయస్సు 20–25 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఆర్ట్స్, సైన్స్ లేదా కామర్స్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో వారు ఎటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగంలో ఉండకూడదు లేదా ఉన్నత చదువులు చదువుతూ ఉండకూడదు. దరఖాస్తుదారు బీహార్ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి. ఈ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత, అభ్యర్థులు తమ పత్రాల పరిశీలన కోసం జిల్లా రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ కేంద్రానికి (DRCC) 60 రోజుల్లోపు వెళ్లవలసి ఉంటుంది.
Also Read : Iran-Israel: ఇజ్రాయెల్‌కు గూఢచర్యం.. నిందితుడిని బహిరంగంగా ఉరితీసిన ఇరాన్
పెద్ద ఎత్తున అవకాశాలు సృష్టిస్తాం
ఈ సహాయం యువత నైపుణ్య శిక్షణ పొందేందుకు, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయపడుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో కోటి మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెద్ద ఎత్తున అవకాశాలు సృష్టిస్తామని సీఎం తన ట్వీట్ లో పేర్కొన్నారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి సీఎం తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి సీఎం ఇప్పటికే చాలా స్కీమ్స్ ప్రకటించారు.
Also Read : Yogi Adityanath : దటీజ్ యోగి.. దిశాపటానీ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు ఖతం !
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో జరగనున్నాయి. ఎన్నికల సంఘం తుది షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 22, 2025 నాటికి కొత్త అసెంబ్లీ ఏర్పాటవ్వాలి. 10.7 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.