హరియాణా అభిమాని రామ్ పాల్ కశ్యప్ ను ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు కలిశారు. 14 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అతనిని ఎట్టకేలకు ఇవాళ హరియాణాలో కలసి కాసేపు సస్పెండ్ చేశారు. అంతేకాదు తన కోసం చెప్పులు వేసుకోకుండా ఎదురు చూస్తున్న అతనికి స్వయంగా తన చేత్తోనే బూట్లు కూడా తొడిగారు ప్రధాని. ఆ బూట్లను మోదీనే గిఫ్ట్ గా కూడా ఇవ్వడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రేమ చాలు..ఇలాంటి ప్రతిజ్ఞలు వద్దు..
హరియాణాలో జరిగిన యమునా నగర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ తరువాత కైతాల్ కు చెందిన రామ్ పాల్ కశ్యప్ ను ఆయన కలిశారు. మోదీ ప్రధాని అయి,ఆయనను కలిశాకనే చెప్పులు ధరిస్తానని కశ్యప్ 14 ఏళ్ళ క్రితం ప్రమాణం చేశారు. దీని గురించి ప్రధాని మాట్లాడుతూ..ఇలాంటి వ్యక్తుల ప్రేమ , ఆప్యాయతలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని చెప్పారు. అయితే కశ్యప్ లాంటి ప్రతిజ్ఞలు చేసే ప్రతీ ఒక్కరినీ నేను ఒక్కటే అభ్యర్థిస్తున్నాను. మీ ప్రేమను గౌరవిస్తాను. కానీ ఇలాంటి ప్రతిజ్ఞల కన్నా దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే, నిర్మాణానికి సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టండి అంటూ కోరారు. ఎక్స్ లో కశ్యప్ తో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ఇదంతా రాసారు ప్రధాని మోదీ. దాంతో పాటూగా కశ్యప్ ను ఎందుకలా చేశావ్ అంటూ ప్రేమగా మందలించారు కూడా. నిన్ను నువ్వు ఎందుకు ఇబ్బంది పెట్టుకున్నావ్ అంటూ ఆప్యాయంగా భుజం తట్టారు.
today-latest-news-in-telugu | pm modi | fan | shoes
Also Read: వేలంలో ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. దీని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడమే