మాది మాటల గారడీ పార్టీ కాదు.. దానికే కట్టుబడి ఉన్నాం: విజయ్

ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ ఈ నెల చివర్లో మొదటిసారిగా బహిరంగ సమావేశం నిర్వహించనుంది.ఈ సందర్భంగా విజయ్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ మాటల గారడీ పార్టీ కాదని.. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

New Update
Vijay

ప్రముఖ నటుడు విజయ్ ఇటీవల 'తమిళగ వెట్రి కళగం' అనే కొత్త పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ చేస్తుందని ఇప్పటికే విజయ్ ప్రకటించారు. ప్రస్తుతం ఆ పార్టీ ఎన్నికల్లో గెలిగే లక్ష్యంగా సిద్ధమవుతున్న వేళ.. విజయ్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ మాటల గారడీ పార్టీ కాదని.. అభివృద్ధితో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అక్టోబర్ చివరి వారంలో జరగనున్న ఈ పార్టీ తొలిసారిగా బహిరంగ సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు.  

Also Read: వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే?

ఈ సూత్రాలు పాటించాలి

ఇక వివరాల్లోకి వెళ్తే.. విల్లుపురంలోని విక్రవండిలో అక్టోబర్ 27న తమిళగ వెట్రి కళగం పార్టీ రాష్ట్రస్థాయిలో మొదటిసారిగా బహిరంగ సభకు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ విజయ్ ఓ లేఖను విడుదల చేశారు. కర్తవ్యం, గౌరవం, క్రమశిక్షణ అనే సూత్రాన్ని పాటించాలని సూచనలు చేశారు. రాజకీయాల్లో గెలుపు, ఓటమి మాత్రమే కొలమానాలు కావని.. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. 

Also Read: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

సినిరంగంలో స్టార్ హిరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ స్థాపించడం చర్చనీయాంశమవుతోంది. అలాగే ఈ నెల చివర్లో నిర్వహించనున్న బహిరంగ సభపై ఆసక్తి నెలకొంది. ఇటీవలే విజయ్ పార్టీకి సంబంధించిన జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సిద్ధాంతాలు, ఇతర అంశాలకు సంబంధించిన విషయాలు వెల్లడించేదుకు టీవీకే పార్టీ సిద్ధమవుతోంది. 

Also Read: మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?

ఇదిలాఉండగా.. తమిళనాడులో ఇప్పటికే ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ కూడా 2018లోనే మక్కల్ నిధి మయామ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అలాగే మరో స్టార్ హిరో రజనీకాంత్ కూడా రాజకీయ ప్రవేశం చేయాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం తమిళనాడులో ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో విజయ్ ప్రారంభించిన పార్టీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియాలంటే మరో రెండేళ్ల పాటు వేచి చూడాల్సిందే. 

Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు