Karnataka: ఐపీఎస్ కూతురు స్మగ్లింగ్ ఎందుకు చేసింది? ఎలా పట్టుబడింది?

కర్ణాటక నటి రన్యారావు స్మగ్లింగ్ కేసులో ఆశ్చర్యకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.  సీనియర్ ఐపీఎస్ కుమార్తె అయిన రన్యారావును చివరి నిమిషంలో అధికారులు పట్టుకున్నారు. అరెస్టు తర్వాత విచారణలో అధికారులకు రన్యా రావు కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. 

New Update
 Ranya Rao

 Ranya Rao

కన్నడ నటి రన్యారావు స్మగ్లింగ్ కేసు సంచలనం రేపుతోంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో ఎయిర్ పోర్ట్ లో పట్టుబడింది.  ఆ తర్వాత ఆమె ఇంట్లో సోదాలు చేయగా అక్కడ కూడా రూ. 2కోట్ల విలువైన ఆభరణాలు, మరో రెండు కోట్లకు పైగా డబ్బులు లభ్యమయ్యాయి.  

అసలెలా పట్టుబడింది..

రన్యరావు స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు ఎలా తెలిసిందంటే...ఆమె ఈ మధ్య తరుచుగా గల్ఫ్ దేశాలకు వెళ్ళివస్తున్నట్టు ముందు గమనించారు. అదికూడా చాలా ఎక్కువ. ఎంత అంటే పదిహేను రోజుల్లోనే నాలుగుసార్లు వెళ్ళి వచ్చింది. దానికితోడు దుబాయ్ కు వెళ్ళిన ప్రతీసారి రన్యారావు ఒకే రకమైన బట్టలు ధరించడం కూడా అనుమానాలకు తావిచ్చింది. దీంతో అప్రమత్తమైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమె మీద నిఘా పెట్టారు. అదే సమయంలో రన్యారావు మరోసారి దుబాయ్ నుంచి ఫ్లైట్ దిగింది. ఎప్పుడూలానే మామూలు ప్రయాణికురాలిగా అన్ని భద్రతా తనిఖీలను పూర్తి చేసుకుంది కూడా. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకుని మరోసారి తనిఖీలను నిర్వహించారు. అప్పుడు ఆమె బెల్టులో పెట్టుకొచ్చిన బంగారం బయటపడింది. 

రన్యారావును విచారిస్తున్న అధికారులు..

ఎయిర్ పోర్ట్ లో రన్యారావును అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు ఆమెను విచారించడం ప్రారంభింారు. ఇందులో ఆమె కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్ మెయిల్ చేసినట్టుగా రన్యారావు చెప్పిందని సమాచారం. ఎయిర్ పోర్ట్ లో కూడా ఓ కానిస్టేబుల్ సహాయం చేసేశారు. అధికారులు అతని స్టేట్ మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. త్వరలోనే రన్యారావు భర్తను కూడా అధికారులు విచారించనున్నారు. 

రన్యారావు తండ్రీ ఐపీఎస్ అధికారి...

రన్య తండ్రి కే రామచంద్రారావు కర్ణాటక డీజీపీ. అయితే ఆమెకు ఈయన సవతి తండ్రి. వారిద్దరి మధ్యా చాలా రోజులుగా సంబంధాలు లేవని తెలుస్తోంది. రన్యా పట్టుబడ్డాక ఆయన రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. నాలుగు నెలల క్రితం ఆమెకు పెళ్ళయిందని..అప్పటి నుంచి ఆమెతో తమకు ఎటువంటి సంబంధాలు లేవని చెప్పారు. భర్తతో పాటు ఆమె ఎటువంటి వ్యాపార లావాదేవీలు చేస్తున్నారనే విషయం తమకు తెలియదన్నారు. రన్యా తన భర్తతో పాటూ ఎటువంటి వ్యాపారాలు చేస్తోందన్నది తనకు తెలియదని అన్నారు. ఆమె పట్టుబడిన విషయం విన్నాక తాను షాక్ కు గురయ్యాని డీజీపీ చెప్పారు. 

Also Read: RGV: నాపై కేసు కొట్టేయండి..హైకోర్టుకు రాంగోపాలవర్మ

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు