Air India Flight Crash  : ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. వైరల్ అవుతోన్న వీడియో!

అహ్మదాబాద్‌ విమానాశ్రయం సమీపంలో లండన్‌కు వెళ్లే ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తక్కువ ఎత్తులోనే  మేఘానీనగర్‌లోని ఘోడాసర్ క్యాంప్ సమీపంలో కూలిపోయింది. అయితే ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.

New Update
Ahmedabad plane crash

Ahmedabad plane crash

Air India Flight Crash  : అహ్మదాబాద్‌ విమానాశ్రయం సమీపంలో లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తక్కువ ఎత్తులోనే  మేఘానీనగర్‌లోని ఘోడాసర్ క్యాంప్ సమీపంలో  కూలిపోయింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులున్నారు. గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణి ఈ విమానంలో ఉన్నారు. కాగా ప్రమాదం కారణంగా విమానంలో ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ అధికారికంగా దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

విమాన టేకాఫ్‌ అయిన వెంటనే ఓ పెద్ద చెట్టును ఢీకొట్టి కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభమైంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎంత జరిగిందన్న వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.   

అయితే ఈ ప్రమాదానికి  ఎయిర్‌ఇండియా అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన విమానానికి గతంలో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు మొరాయించినట్లు చెబుతున్నారు. గత డిసెంబర్‌లో ఇదే విమానంలో పొగలు వెలువడ్డాయి. ఈ ఏడాదిలో రెండుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. అంతేకాక గత ఏడాది జూన్, డిసెంబర్‌లో రెండు సార్లు ప్రమాదాలు తప్పినట్లు తెలుస్తుంది. ఇదే విమానం గతవారం ప్యారిస్ వెళుతుండగా సాంకేతిక సమస్య కారణంగా షార్జాలో ఎమర్జెన్సీ లాండింగ్ చేయాల్సి వచ్చింది. విమాన సమస్యలపై డీజీసీఏ అలర్ట్ చేసినప్పటికీ ఎయిర్‌ ఇండియా సిబ్బంది పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.   

మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో  సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.  ఇదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చిన ఆకాశ్‌ అనే ప్రయాణికుడు విమానంలో పరిస్థితిని వీడియో తీసి వివరించాడు.  విమానంలో  ఏసీలు పనిచేయడం లేదని వివరించినా ఆయన, విమానంలో అంతా అస్తవ్యస్తంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఏమాత్రం కండీషన్‌ లేని ఇలాంటి విమానాన్ని ఎలా నడుపుతున్నారంటూ ఎయిర్ ఇండియాకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన ప్రశ్నించినట్లే టేకాఫ్‌ అయిన ఐదు నిమిషాలకే విమానం కుప్పకూలి అందరూ మరణించారు.

Advertisment
తాజా కథనాలు