మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ కీలక ప్రకటన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ తెలిపారు. అలాగే ఝార్ఖండ్ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. By B Aravind 26 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇటీవల హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఎన్నికల్లో ఆప్ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆప్ పోటీ చేస్తుందనే ఊహగాణాలు వచ్చాయి. అయితే తాజాగా ఆప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ తెలిపారు. మహా వికాస్ అఘాడీ కూటమిలో పార్టీలకు మద్దతుగా ఆప్ కన్వీవర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నారు. Also Read: బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు మహారాష్ట్రతో సహా ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం లేదని పార్టీ వర్గాలు చెప్పాయి. హేమంత్ సోరెన్‌కు సపోర్ట్‌గా ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని పేర్కొన్నాయి. మహారాష్ట్రలో 288 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఝార్ఖండ్‌లో 13, 20 తేదీల్లో రెండు విడుతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌తో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కానీ పంజాబ్‌లో మాత్రమే ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా విఫలమైంది. వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడకుండా నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఓడించేందుకే ఓట్లు చీలిపోకుండా ఆప్ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: ప్రాణాలతో చెలగాటం..49శాతం ఫేక్ మెడిసన్స్.. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి రావాలని మహా వికాస్ అఘడీ కూటమిలో ఉన్న శివసేన (UBT), ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్ నేతలు అరవింద్ కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ కూడా వాళ్ల విజ్ఞప్తికి సానుకూలత వ్యక్తం చేశారు. త్వరలోనే ఆయన మహారాష్ట్రలో పర్యటించనున్నట్లు సమాచారం. అలాగే కేజ్రీవాల్‌తో పాటు పలువురు ఆప్ సీనియర్ నేతలు కూడా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. #maharashtra #national-news #arvind-kejriwal #aap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి