బాలికపై గ్యాంగ్ రేప్.. ఆరుగురు అరెస్టు

ఒడిశాలోని బోలంగీర్‌ జిల్లాలో దారుణం జరిగింది. ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బాలికపై ఆరుగురు బాలురు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపింది.

New Update
6 Boys Detained For Raping 15 Year Old Girl In Odisha

6 Boys Detained For Raping 15 Year Old Girl In Odisha

ఒడిశాలోని బోలంగీర్‌ జిల్లాలో దారుణం జరిగింది. ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బాలికపై ఆరుగురు బాలురు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపింది. అంతేకాదు దీన్ని వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చివరికి బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురు బాలురను అరెస్టు చేశారు.ఇక వివరాల్లోకి వెళ్తే.. తురైకేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని 15 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది.  

Also Read: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అనురాగ్ ఠాకూర్‌పై నిషేధం ఎత్తివేత!

అయితే గతేడాది డిసెంబర్ 27 ఆ బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తోంది. ఆరుగురు బాలురు ఆమెను అడ్డుకుని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. వాళ్లు చేసిన దుర్మార్గాన్ని వీడియో కూడా తీశారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ ఆ బాలికను బెదిరించారు. అంతటితో ఆగకుండా ఇటీవలే ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బాధితురాలి తండ్రికి ఈ విషయం తెలిసింది. 

Also Read: రూ. 8 కోట్ల అవార్డు: ప్రపంచాన్ని మెప్పించిన ముంబై టీచర్!

ఫిబ్రవరి 3న ఆయన పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు పోలీసులు రంగంలోకి దిగారు. చివరికి ఆరుగురు బాలురను అరెస్టు చేశారు. వీడియో రికార్డ్ చేసిన మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడైన 17 ఏళ్ల బాలుడిని వయోజనుడిగా పరిగణించాలని కోర్టును అభ్యర్థిస్తామని ఓ పోలీస్ అధికారి తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు