Maoist Encounter: పక్కా వ్యూహంతోనే ఎన్‌ కౌంటర్

నిన్న దంతెవాడ–నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌‌తో దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లింది. 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్‌‌ గురించి ఈరోజు పోలీస్ ఉన్నతాధికారులు వివరాలు తెలిపారు. కింది ఆర్టికల్‌లో చదవండి..

author-image
By Manogna alamuru
encounter
New Update

Maoist Encounter Details: 

పక్కా వ్యూహంతోనే ఎన్‌కౌంటర్ చేశామని చెబుతున్నారు పోలీసు అధికారులు. ఇందులో మొత్తం డిస్ట్రిక్ట్ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ)కి చెందిన 1500 మంది పోలీసులు పాల్గొన్నారని దంతెవాడ అడిషనల్‌ ఎస్పీ ఆర్కే బర్‌మన్ చెప్పారు. రెండు రోజులు ఆపరేషన్ చేపట్టామని తెలిపారు.  అక్టోబరు 3 ఉదయమే ఆపరేషన్‌ ప్రారంభించామని...దాని ప్రకారం  కంపెనీ నెంబర్‌ 6, తూర్పు బస్తర్‌ డివిజన్‌ దళాలు గవాడి, థుల్‌థులి, నెందూర్‌, రెంగవయా గ్రామాల్లో ఉన్న మావోయిస్టుల గురించి సమాచారం తెలుసుకుని మరీ దాడి చేశామని చెప్పారు.  విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిందని.. దానిని రూఢీ చేసుకున్న తర్వాతనే ఎన్‌కౌంటర్ ఆపరేషన్ మొదలుపెట్టామని తెలిపారు. 

అయితే ఈ ఆపరేషన్ చాలా కష్టం అయిందని అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. మావోయిస్టులకు తెలియకుండా వెళ్ళడానికి...వారున్న ఎత్తైన కొండప్రాంత చేరుకోడానికి 10 కి.మీ వరకు బైక్స్ మీద.. ఆ తర్వాత 12 కి.మీలు నడిచి వెళ్ళారని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. నెందూర్‌, థుల్‌థులి గ్రామాల్లో అయితే చీకటి పడేవరకు కాల్పులు కొనసాగాయి. శుక్రవారమే 28 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. శనివారం మరో 3 లభ్యమయ్యాయి. ఈ ఆపరేషన్‌కు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు బలగాలు కూడా సహకారం అందించాయి అని ఆర్కే బర్‌మన్‌ చెప్పారు. మృతి చెందిన వారు అందరూ పీపుల్ లిబరేషన్ గెరిలా ఆర్మీకి చెందినవారని చెప్పారు. అయితే వారిలో ఎవరు ఎవరన్నది ఇంకా తెలియలేదని చెప్పారు. పూర్తిగా పరిశీలించాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. దీంట్లో భారీ ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏకే-47 రైఫిల్‌, ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్‌సాస్‌, ఎల్‌ఎంజీతోపాటు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో కేవలం ఒక్క జవాన్ మాత్రమే గాయపడ్డారని..అతనికి చికిత్స జరుగుతోందని చెప్పారు. 

 

Also Read: supreme court: ఇంక ఓపిక లేదు..రేషన్ కార్డుల వ్యవహారంపై సుప్రీం అసహనం

#national-news #maoist-encounter
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe