/rtv/media/media_files/2025/10/17/ravaba-2025-10-17-20-57-19.jpg)
Rivaba Jadeja
Rivaba Jadeja: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం శుక్రవారం (అక్టోబర్ 17) భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. కొత్తగా 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా.. వారికి శాఖలను కేటాయించారు. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి, జామ్‌నగర్ ఉత్తర ఎమ్మెల్యే రివాబా జడేజాకు కీలకమైన విద్యా శాఖ బాధ్యతలు అప్పగించారు. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆమెకు ఇంతటి కీలక బాధ్యత దక్కడం విశేషం.
Also Read: రైతుల వెంటపడ్డ పులి, భయంతో చెట్లెక్కిన స్థానికులు.. వీడియో వైరల్
హర్ష్ రమేష్‌భారు సంఘవీకి ఉపముఖ్యమంత్రిగా
రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన యువ నాయకుడు హర్ష్ రమేష్‌భారు సంఘవీకి ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి లభించింది. ఆయనకు హోం, రవాణా, క్రీడలు, యువజన సేవలు, జైళ్లు, సరిహద్దు భద్రత వంటి కీలక శాఖలను కేటాయించారు. రుషికేష్ గణేష్‌భాయ్ పటేల్‌కు ఇంధనం, పెట్రోకెమికల్స్, పంచాయతీ, గ్రామీణ గృహనిర్మాణం, శాసనసభ, పార్లమెంటరీ వ్యవహారాలు అప్పగించారు.
Also Read: ఈ అక్కాచెల్లెళ్లు మామూలోల్లు కాదు.. పెళ్లిళ్లు చేసుకుంటూ డబ్బులు, నగలతో పరార్
2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 26 మందితో కూడిన ఈ మంత్రివర్గంలో సామాజిక మరియు ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేశారు. కొత్త మంత్రివర్గంలో 7 మంది పాటిదార్లకు, 8 మంది ఓబీసీలకు, 3 మంది ఎస్సీలకు, 4 గురు ఎస్టీలకు అవకాశం కల్పించారు. మహిళా మంత్రుల సంఖ్యను కూడా పెంచారు. కాగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా పాత మంత్రివర్గంలోని మంత్రులందరూ గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది.