అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో స్నాక్స్ తిన్న తర్వాత దాదాపు 200 మంది అస్వస్థకు గరవ్వడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని గోలాఘాట్ జిల్లా పాస్‌ఘోరియా గ్రామానికి చెందిన ప్రదీప్ గోగోయ్ తల్లి ఇటీవల మరణించింది. అయితే ప్రదీప్ తన తల్లి స్మారక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులను ఆహ్వానించారు.
Also Read: వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే?
ఇద్దరి పరిస్థితి విషయం
అయితే ఈ కార్యక్రమానికి హాజరైన వారికి సంప్రదాయంగా ఇచ్చే జల్పాన్ (పఫ్ట్ రైస్, క్రీమ్‌తో కూడిన స్నాక్స్) పెట్టారు. అక్కడున్న అతిథులు వాటిని తీసుకున్నారు. దాన్ని తిన్న కొద్దిసేపటి తర్వాత వాళ్లు అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు 200 మంది అస్వస్థకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వాళ్లని మెరుగైన చికిత్స కోసం జోర్హాట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించామని ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
Also Read: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..
గ్రామస్థుల ఇళ్లకు వైద్యులు
స్థానిక బీజేపీ ఎమ్మెల్యే బిస్వజిత్ ఫుకాన్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మరోవైపు ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామస్థుల ఇళ్లకు వైద్య బృందాలు పంపినట్లు తెలిపారు. ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో ఫుడ్ పాయిజనింగ్ అవుతున్న ఘటనలు చాలానే బయటపడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌లో అన్నం తిని విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న ఘటనలు ఎన్నో జరిగాయి.
Also Read: మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?
Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?