ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాల్లు సంపన్నులు, రిటైర్డ్ ఉద్యోగులనే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఫోన్ కాల్స్ చేసి బాధితులను మభ్యపెట్టి డబ్బులు గుంజేస్తున్నారు. అయితే ఇలా చేయాలంటే ఎదుటివారిని చాలా నమ్మించాలి. ఏ మాత్రం తేడా వచ్చినా డబ్బులు కాజేయలేరు. ఎంతో టాలెంట్, సహనం, మాట తీరు ఉండాలి. ఇప్పటి వరకు బాధితులను మోసం చేసి డబ్బులు గుంజుకున్న వారందరూ దాదాపు 30 ఏళ్లకు పైబడినవారే. వారందరి పోలీసులు పట్టుకున్నారు కూడా. అయితే తాజాగా అలాంటిదే జరిగింది.
Also Read: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో 11వ తరగతి చదువుతున్న ఒక కుర్రోడు ఘరానా మోసం చేసి పోలీసులకు పట్టుపడ్డాడు. ఒకరిద్దరిని కాదు ఏకంగా 200 మందిని బురిడి కొట్టించాడు. లక్షల్లో వారి నుంచి దోచుకున్నాడు. ప్రజలకు పెట్టుబడి పథకాల గురించి చెప్తూ వారిని నుంచి దోచేశాడు. చివరికి ఒక బాధితురాలి ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
19 ఏళ్ల కాషిఫ్ మీర్జా
అజ్మీర్ జిల్లాలోని నసీరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల కాషిఫ్ మీర్జా 11వ తరగతి చదువుతున్నాడు. అతడు సోషల్ మీడియా ద్వారా మోసం చేసేవారు. రూ.లక్షల కోట్ల లాభాలతో మభ్యపెట్టి పెట్టుబడి పథకాల గురించి చెప్పుకొచ్చేవాడు. ప్రజలు కూడా అతడి మాటలకు ఆకర్షితులయ్యారు. కాషిఫ్ మీర్జా ఇంగ్లీష్‌లో గుక్కతిప్పకుండా మాట్లాడి ప్రజలను క్షణాల్లో వలలో పడేసేవాడు.
Also Read : పాములు నిజంగా పగబడతాయా?..అసలు నిజమేంటి?
ఎంతో చాకచక్యంగా మాట్లాడేవాడు. సోషల్ మీడియా వేదికగా పెట్టుబడి పథకాల గురించి చెప్పేవాడు. మంచి లాభాలను సంపాదిస్తారని ప్రజలను మభ్యపెట్టేవాడు. అలా ప్రజలు అతడి ఉచ్చులో పడి తమ పొదుపు డబ్బును కోల్పోయారు. అయితే బాధితురాలి ఫిర్యాదుతో జిల్లా సైబర్ పోలీసులు కాషిఫ్ మీర్జాని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు అతడు దాదాపు 200 మందిని ఆన్‌లైన్‌లో మోసం చేశాడని పోలీసులు తెలిపారు.
ఆ యువకుడిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 2 రోజుల పోలీసు రిమాండ్‌కు పంపించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. కాషిఫ్ వద్ద లగ్జరీ కారు, ఖరీదైన ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.