/rtv/media/media_files/2025/02/10/Bjlss7CXiNpglP2v1niX.jpg)
Illeagal Immigrants
దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న కొందరు విదేశీయులను భారత ప్రభుత్వం తిరిగి వెనక్కి పంపించింది. వాళ్ల వీసా గడువు ముగిసినా కూడా ఢిల్లీలో ద్వారక ప్రాంతంలో 16 అక్రమంగా నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీళ్లలో బంగ్లాదేశ్‌కు చెందినవారు ఐదుగురు, నైజీరియా 9, గినియా 1, ఉజ్బెకిస్థాన్ 1 చొప్పున ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read: అమెరికాలో ఉన్న ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్.. ఊడుతున్న వేలాది ఉద్యోగాలు!
వీళ్లను డిటెన్షన్ కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి వాళ్ల స్వదేశాలకు పంపించినట్లు చెప్పారు. అయితే ఇందులో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఉంది. వీళ్లలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ప్రస్తుతం అక్రమ వలసదారుల అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికా అక్రమ వలసదారులను ప్రత్యేక సైనిక విమానాల్లో వాళ్ల స్వదేశానికి పంపిస్తోంది.
Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే
ఇటీవల 200 మందికి పైగా భారతీయ అక్రమ వలసదారులను కూడా సైనిక విమానంలో వెనక్కి తరలించింది. మరో 600 మందిని తరలించేందుకు సిద్ధమవుతోంది. అయితే అక్రమ వలసదారుల అంశంలో అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా వెళ్తోంది.ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌లోకి అక్రమంగా వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న 600 మందికి పైగా వలసదారులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. సోమవారం అక్రమ వలసదారులపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంచలన ట్వీట్ చేశారు. '' అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతాం. బ్రిటన్‌లో అక్రమ వలసదారుల సంఖ్య పెరిగింది. చాలామంది ఇక్కడికి అక్రమంగా వచ్చి పనులు చేసుకుంటున్నారని'' కీర్ స్టార్మర్ రాసుకొచ్చారు.
Also Read: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ పెంచి పోషించిన ప్రధాని.. 50 వేల మంది మృతి!
Also Read: ఖమ్మంలో కీచక లాయర్.. విడాకుల కోసం వెళ్లిన మహిళకు కడుపు చేసి..!