BIG BREAKING : కల్తీ మద్యం తాగి 14 మంది మృతి

పంజాబ్లోని అమృత్‌సర్‌ జిల్లాలో ఉన్న మజితలో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందారు. మరో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. భంగలి, పటాల్‌పురి, మరారి కలాన్, తేరేవాల్ ,తల్వండి ఘుమాన్ అనే ఐదు గ్రామాలలో మరణాలు సంభవించాయి

New Update
spurious liquor

spurious liquor

పంజాబ్లోని అమృత్‌సర్‌ జిల్లాలో ఉన్న మజితలో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందారు. మరో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. భంగలి, పటాల్‌పురి, మరారి కలాన్, తేరేవాల్ ,తల్వండి ఘుమాన్ అనే ఐదు గ్రామాలలో మరణాలు సంభవించాయి. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు ప్రభత్ సింగ్ తో  పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. వారు ఈ మద్యం ఏ సంస్థల నుండి కొనుగోలు చేశాడనే దానిపై మేము దర్యాప్తు చేస్తున్నామని  తెలిపారు.  వారిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.ఈ ఏడాది జనవరిలో బిహార్ లో  కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

అరెస్టు చేయబడిన ఇతర నిందితులలో:

ప్రధాన నిందితుడు ప్రభజీత్ సింగ్ సోదరుడు కుల్బీర్ సింగ్ అలియాస్ జగ్గు
సాహిబ్ సింగ్ అలియాస్ సరాయ్, మార్డి కలాన్ నివాసి
గుర్జంత్ సింగ్
తిరెన్వాల్ నివాసి జీత భార్య నిందర్ కౌర్

Also read :  IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు