National Anthem: జమ్మూకశ్మీర్‌లో ఇకనుంచి జనగణమన పాడాల్సిందే

జమ్మూకశ్మీర్‌లో ఇదివరకు ఉదయం పాఠశాలల్లో జాతీయ గీతం పాడాలనే రూల్ లేదు. దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేయాలని ఆదేశించింది.

National Anthem: జమ్మూకశ్మీర్‌లో ఇకనుంచి జనగణమన పాడాల్సిందే
New Update

National Anthem Made Compulsory in J&K: భారత్‌లో అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల్లో ఉదయం విద్యార్థులు ప్రార్థనా చేసేటప్పుడు జాతీయ గీతాన్ని పాడుతారు. కానీ జమ్మూకశ్మీర్‌లో మాత్రం ఇదివరకు జాతీయ గీతం కచ్చితంగా పాటించాలనే రూల్‌ ఏమి లేదు. అయితే దీనిపై తాజాగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్‌లో (Jammu Kashmir) కూడా ఇకనుంచి అన్ని పాఠశాలల్లో జాతీయ గీతం 'జనగణమన' పాడటం తప్పనిసరి కానుంది. అన్ని పాఠశాలల్లో ఉదయంపూట ప్రార్థనా సమయంలో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేయాలని జమ్మూకశ్మీర్‌ పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇది విద్యార్థుల మధ్య ఐక్యతను, క్రమశిక్షణను పెంపొందిస్తుందని పేర్కొంది.

Also Read: పవన్‌కు ఆరు పవర్‌ఫుల్ శాఖలు.. ఏరికోరి ఎంచుకున్న జనసేనానీ

అలాగే ఆ సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం కోసం వక్తలను కూడా ఆహ్వానించాలని సూచనలు చేసింది. విద్యార్థులకు ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులు, భిన్నమైన సంస్కృతులు, చారిత్రక విషయాలు, పర్యావరణంపై అవగాహన లాంటి 16 అంశాలను పాఠశాలల్లో పాటించాలని విద్యాశాఖ ఆదేశించింది.

Also Read: కేంద్రం, ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు

#jammu-kashmir #telugu-news #national-news #national-anthem
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి